సహజగుణము

bookmark

చిమడకే చిమడకే
ఓ చింతకాయ!
నువ్వెంత చిమిడినా,
నీ పుల్ల పోదు.

ఉడకకే ఉడకకే
ఓ ఉల్లిపాయ!
నువ్వెంత ఉడికినా,
నీ కంపు పోదు.