విత్తముగలవాని వీపు పుండైనను

bookmark

విత్తముగలవాని వీపు పుండైనను
వసుధలోన జాల వార్తకెక్కు
బేదవానియింట బెండ్లయిననెగరు
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
అధిక ధనం గలవాని వీపు పైన అయిన పుండు సైతము నలుగురి నోళ్ళలోబడి ప్రచారమగును. కానీ బీదవానింట పెండ్లయిన ఎవ్వరూ చెప్పుకోరు.