విద్యలేని వాడు విద్యాధికుల చెంత

bookmark

విద్యలేని వాడు విద్యాధికుల చెంత
నుండినంత బండితుండు కాఁడు
కొలని హంసలకడఁ గొక్కెరయున్నట్లు
విశ్వధాభిరామ వినురమేమ.

తాత్పర్యం-
హంసలతోఁ గలసిమెలసి యున్నంత మాత్రాన కొంగ మార్పు జెందలేనట్లు, పండితులతో గూడియు మూఢుఁడు మారజాలడు.