దోసపళ్ళు

bookmark

త్రోవలో ఒకరాజు తోటేసినాడు
తోటలోపల పండ్లు దొర్లుతున్నావి.
దొర్లుతున్నవి తియ్య దోసపండ్లన్ని,
ఆ పండ్లు పంపాడు ఆరగించంగ.
తింటేను తియదోస పండ్లే తినాలి,
కంటేను కొడుకుల్ల కాన్పే కనాలి.
కంటేను కొడుకుల్ల కాన్పే కనాలి.
అందితే అన్నతో వియ్యమందాలి.
అందితే అన్నతో వియ్యమందాలి,
ఆడితే వదినతో జగడమాడాలి.