తేనెకన్న మధురం మన తెలుగు
తేనెకన్న మధురం రా, తెలుగు ఆ
తెలుగుదనం మా కంటి వెలుగు
తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన, మా
తెలుగు గుండెలో స్నేహము ఎంత చెప్పన
మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన, మన
తరతరాల కధను పాడు గుండె ఝుల్లున
పాటుపడిన వాళ్ళకే లోటు లేదను
చాటి చెప్పు తల్లికదా తెలుగుతల్లి
లలితకళలు సంగీతం సాహిత్యం
తెలుగు తల్లి జీవితాన దినకృత్యాలు
గత చరిత్ర మన చరిత్ర ఎంత ఖ్యాతి!
గర్వించదగ్గ జాతి తెలుగు జాతి!
అయినా గతంకన్న భవిష్యత్ ఆశాజనకం
ఆ భావి కొరకు ధరించాలి దీక్షాతిలకం
