తెలుగు యువకుల్లారా!
ఇది వైకుంఠము, వేంకటేశ్వరుడు ల
క్ష్మీశుండు కొల్వుండుటన్;
ఇది కైలాసము, మల్లికార్జునుడి ఆ
ర్యేశుండు చెల్వొందుటన్;
ఇది బ్రహ్మోర్వి, సరస్వతీ చరణ పం
కే జాతమై యొప్పుటన్;
ఇది మా ఆంధ్రము నీకు పీఠము త్రిశ
క్తీ; పూజ గై కోగదే;
వాణియు తీర వాటిక, భ
వానియె రాయలసీమ, శ్రీ తెలం
గాణము పూర్ణ రాజ్యరమ
గా ముగురమ్మల మూర్తిదాల్చి గీ
ర్వాణ పధమ్ములనే గదలి
వచ్చితినే; జగమేలు కొమ్మకన్
రాజ దలిర్ప, మాగపతి
రంజిల, ఆంధ్రమా, భాగ్యసాంద్రమా!
దేశము జుట్ట బెట్టి తల
దిండుగ బెట్టుక నిద్రపోవు ఆ
వేశము తెల్గువానిది; ప్ర
వేశము తక్కువ కార్య నైపుణిన్;
ఏ శిఖరాల వెంబడి గ
మించునో, ఏ శశిపై శ్రమించునో
పరమ కవిత్వ మందు ప్రతి
వారును బమ్మెర పోతరాజె; సుం
దర తమ గాన మందు ప్రతి
తమ్ముడు తానొక త్యాగరాజె; న
త్వర పరదన మందు, ప్రతి
త్వర పరదన మందు, ప్రతి
డరయ సవాంధ్ర మందు ప్రజ
లందరు రాజులె రాజ తేజులే
కలసి ఉంటే గెలుపు కొస్తాం
చీలిపోతే కూలిపోతాం
భీముడూ గొప్పవాడే
అర్జునుడూ గొప్పవాడే
ధర్మరాజు కూడ గొప్పవాడే
కలిసి ఉన్నపుడు
సుందోప సుందులు కాకండర్రా!
ఓ తెలుగు యువకుల్లారా!
మిమ్మల్ని భ్రమింప జేస్తున్న రంభ
వట్టి వయాముఖ విషకుంభ!
