తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు
తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమీ
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా
విశ్వధాభిరామ వినురమేమ.
తాత్పర్యం-
వేమన శతకంలో వేమన దేవతలతో సమానమైన తల్లిదండ్రుల మీద దయ, జాలి, కరుణ చూపని కొడుకు పుట్టినా ఏం ఉపయోగం లేదు. వాడు చనిపోయినవాడితో సమానం. అలాంటి కొడుకు పుట్టలో పుట్టి పుట్టలోనే నశించి పోయే చెదలుతో సమానం అని పోల్చాడు.
