ధనము కూడబెట్టి దానంబు చేయక

bookmark

ధనము కూడబెట్టి దానంబు చేయక
తాను దినక లెస్స దాచుకొనగ
తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా
విశ్వధాభిరామ వినురమేమ.

తాత్పర్యం-
వేమన శతకంలో వేమన లోభి గురించి ఈ విధంగా వర్ణించాడు. బాగా ధనము కలిగిన పిసినారి ఆ ధనమును ఇతరులకు ధాన ధర్మములు చేయక, తాను కూడా తినక, అనుభవించక వాటిని చూసుకుంటూ జీవతం గడిపేసి చివరికి చనిపోతాడు. తేనెటీగ కూడ ఎంతో కష్టపడి పూలలోని మకరంధాన్ని తెచ్చి తేనెను తయారు చేసి అవి తాగకుండా పరుల పాలు చేస్తాయి. ఈ పద్యంలో వేమన లోభిని తేనె టీగలతో పోల్చాడు. లోభి తేనెటీగ లాంటి వాడు అని అర్థం.
sri rama