తమాషా ప్రశ్నలు -3
1. మనుషులు లేని విందు ?
కనువిందు
2. ఊరిలో లేని సందు ?
పసందు
3. బచ్చలి కూరలో ఉన్న గొప్ప చక్రవర్తి ?
బలిచక్రవర్తి
4. చారలు లేని జీబ్రా?
ఆల్ జీబ్రా
5. వాసన ఇచ్చే వనము ?
దవనము
6. ఇంటికివెయ్యని వాసము ?
సహవాసము
7. సామానులు మొయ్యని లారి ?
దలారి
8. లెక్కలు రాయని కరణము
త్రికరణము
9. తాగలేని పాలు ?
దీపాలు
10. వెంకన్న లో క్రిష్నున్ని దొంగ చేసింది ?
వెన్న
11. పేరులోనే నిధి ఉన్నది ఎవరు?
కరుణానిధి
12. ఆకాసంలో కనిపించే వనాలు?
ఋతుపననాలు
13. కనబడని జనాలు ఎక్కడ ఉన్నారు?
ప్రయోజనాలు
14. ఉచితం లో కొందరిని భాదించేది?
చింత
15. ఎవరికీలేని గోళ్ళు ?
కొనుగోళ్ళు
16. పేరులో జాబ్ ఉన్న ఊరు ఏది?
పంజాబ్
16. సునామీ లో ఉన్న హీరోయిన్ ఎవరు?
మీనా
17. చెట్టుకు వేలాడే నరం?
వానరం
18. కనబడని కారు
షావుకారు
19. ఎవరికీ లేని దంతం
ఉదంతం
20. టైలర్ కుట్టలేని లాగు
డైలాగు
21. రాజు చెయ్యలేని రణం
కారణం
22. దేవుడు ఇవ్వని వరం
వివరం
23. లావేరులో చెట్టులో కనబడని భాగం
వేరు
24. ఉద్యోగంలో నీరున్నది ఎవరు
ఇంజనీరు
25. పోరాటం చేసే వారిని కోపంగా వెల్లమనండి
పోరా
