తమాషా ప్రశ్నలు -14
1. పాతర లో రైతు పనిముట్టు?
పార
2. జవాబులు లో తడిస్తే వచ్చే ది ?
జలుబు
3. కనిపించని జనం ఎ క్కడ ఊన్నారు ?
భోజనం
4. నడవలేని పాము ?
వెన్నుపాము
5. ఊచితంగాదిది లో తెలుగు వారి పండుగ ?
ఉగాది
6. కామవరపుకోటలో విరామచిహ్నం ?
కామ
7. కలతలో పాకి అల్లుకొనేది ?
లత
8. అభిప్రాయంలో ఉన్న యవ్వనం ?
ప్రాయం
9. అభియోగం లో ఆరోగ్యం ఇచ్చేది ?
యో గ
10. కనికరములో పనులుచే సేది ?
కరము
11. కాకి ఉన్న ఊరు ఏది ?
కాకినాడ
12. సతిలేని పతి?
పరపతి
13. అడగకుండా లేరని చెప్పే ఊరు ఏది?
ఆలేరు
14. ముల్లు లేని వాచీ ఏది?
తివాచీ
15. నుదుటి కి పెట్టు కోలేని బొట్టు?
తాలి బొట్టు
16. టైము చెప్ప ని వాచీ ఏది ?
తివాచీ
17. తినగలిగే రాయి ?
పావు రాయి
18. ముట్టుకొంటే షాక్ కొట్టే రెంటు ఏ ది ?
కరెంటు
19. టైలర్ వాడని దారం ?
మం దారం
20. చెల్ల ని కాసు ?
తిరకాసు
