తమాషా ప్రశ్నలు -15
1. పడకలో ఊన్న ఊరు?
కడప
2. నడవలేని నంది ఎక్కడ ఉంది?
మహానంది
3. ముక్కుకు రాసుకోలేని విక్సు ఏది?
సివిక్సు
4. పునాది లో ఆకు కూర ఏది?
పుదీనా
5. గాలి ఇచ్చే కర్ర ఏది?
విసనకర్ర
6. కడుపులో పుట్టే కారం ఏది ?
వికారం
7. చెయ్యలేని దానం ?
నిదానం
8. ఉద్యో గస్తులు లేని బ్యాంక్ ?
బిట్ బ్యాంకు
9. వంచ లేని కీలు ?
వకీలు
10. వ్య వసాయం చెయ్యని ఫా ర్మ ర్ ?
ఇన్ ఫార్మర్
11. తినలేని జాం ఏది ?
రాజాం
12. అప్పడాలు లో యుద్దాని కి పనికి వచ్చేది ?
డాలు
13. లావేరు లో చెట్టుకు మూ లం ?
వేరు
14. గుడివాడలో దేవుడు ఉండేది ?
గుడి
15. వరంగల్ లో దేవుడు ఇచ్చేది ?
వరం
16. గండరగోళం లో శివుడు మింగినది ?
గరళం
17. పాలమూరు లో దేవదాసు ప్రియురాలు ?
పారు
18. మనిపూరీ లో తినేది ?
పూరీ
19. పంచాంగం లో లేని తిధి ?
అతిధి
20. పాకిస్తాన్ లో తినే ది ?
పాన్
