చప్పట్లు

bookmark

చప్పట్లోయి, తాళాలోయి,
దేవుడిగుళ్లో మేళాలోయ్‌!
పప్పూ బెల్లం దేవుడికోయ్‌,
పాలూ నెయ్యీ పాపాయి కోయ్‌!

గోవిందుడమ్మా!
గోపాలుడమ్మా!
కొబ్బరీ బెల్లమ్ము,
కొనితెచ్చినాడే.

ఏడాది కొకసారి
ఇటువచ్చినాడే.
పల్లెటూళ్లుగాన,
చెల్లిపోయింది.

గొల్లవాళ్లముగాన,
కూడివచ్చింది.
పట్నవాసములోన
పనికివస్తుందా?