బండిపాట
బండోయమ్మ బండి
బండికి కుచ్చులు తెండి.
సుబ్బారాయుడు పెండ్లి,
చూచివత్తాం రండి.
అమ్మ నాకు బువ్వ,
అరచేతిలో గవ్వ.
నీళ్ల మీద నిప్పు,
అల్లరి పిల్లల ఒప్పు.
చేయబోకు తప్పు,
చేస్తే కాలిచెప్పు.
