కలిసి పాడుదాం

bookmark

కలసి పాడుదాం తెలుగుపాట
కదలి సాగుదాం వెలుగుబాట
తెలుగువారు నవజీవన నిర్మాతలనీ
తెలుగుజాతి సకలావనికే జ్యోతియని || కలసి ||
కార్యశూరుడు వీరేశలింగం
కలం పట్టి పోరాడిన సింగం
దురాచారాల దురాగతాలను
తుదముట్టించిన అగ్ని తరంగం
అడుగో అతడే వీరేశలింగం.....
మగవాడెంతటి ముసలాడైనా
మళ్ళీ పెళ్ళికి అర్హుడవుతుంటే
బ్రతుకే తెలియని బాలవితంతువు
కెందుకు లేదా హక్కంటాను.....
చేతికి గాజులు తొడిగాడు
చెదిరిన తిలకం దిద్దాడు
మోడువారిన ఆడబ్రతుకుల
పసుపుకుంకుమ నిలిపాడు.....
అడుగో అతడే గురజాడ
మంచి చెడ్డలు లోకమందున
ఎంచి చూడగా రెండు కులములు
మంచియన్నది మాలయైతే
మాలనేనౌతాను అన్నాడు.....