ఒక్కటేరా! తెలుగుదేశం
ఒక్కటేరా! తెలుగుదేశం
ఒకటేరా! తెలుగు భాష
ఎక్కడున్నా తెలుగులందరు
ఒక్కటేరా! ఒక్కటేరా!
ఒక్కటే గోదావరీ నది
ఒక్కటే కృష్ణా నది
రెండు నదులూ తెలుగు జాతి
గుండెలో ఒకటైనవి || ఒక్కటేరా ||
అరకు లోయల గలికొండ
హైదరాబాద్ గోల్కొండ
కలిసి కట్టెను తెలుగుతల్లి
కంఠసీమను పూలదండ || ఒక్కటేరా ||
సాగరమ్మొక వైపున నిజాం
సాగరమ్మొక వైపున
తెలుగు తల్లిని వీచు చల్లని
అలల వీనన అదముప్పగ || ఒక్కటేరా ||
ఎదలు ఎదలు కూర్చి కట్టిన
ఏకతా సేతువుల మీద
కదలివచ్చీ అభ్యుదయ చ
క్రాల నడ్డుట చేటుగదా? || ఒక్కటేరా ||
నలుగు రెవరో తప్పుచేసిన
ఏడు కోట్లకు శిక్ష తగునా
ఎలుగ లేవో దూరినాయని
ఇంటినే తగలేయ తగునా || ఒక్కటేరా ||
పాడి తప్పక పాటు పడదాం
పంటలు పరిశ్రమలు పెడదాం
మెండుగా ఉత్పత్తి పెంచి
దండిగా అందరము ఉందాం || ఒక్కటేరా ||
పేదవోయిన తెలంగాణను
సెలవయిన సర్కారు ప్రాంతము
మధ్య భేధము మానివేద్దాం || ఒక్కటేరా ||
ఆకలికి ఆవేశమునకు
అహంకృతికి ద్వేషమునకు
మంచి చెడ్డలు కానుపించవు
మంచి మాటలు వినుపించవు || ఒక్కటేరా ||
ఒక్క జాతిని రెండు ముక్కలు
ఒక్క గుండెకు రెండు చెక్కలు
చేయువాడెవడైన, ద్రోహము
చేయువాడే తెలుగు తల్లికి || ఒక్కటేరా ||
గోదావరి కృష్ణ నేడు
కూడి సాగగా
ప్రతి ఆంధ్రుని ఎద సమైక్య
భావమాడెగా! || ఒక్కటేరా ||
జాతిని చీల్చిన గోడల
జాడ మానెరా
మూగపడ్డ వీణ తిరిగి
మ్రోయ సాగెరా!
కలలు నిజములై కన్నుల || ఒక్కటేరా ||
కాంతి నింపగా
చరిత్రలో స్వర్ణ యుగం
తిరిగి మొలిచెరా! || ఒక్కటేరా ||
గతమునుండి గుణపాఠము
గాంచి మెలగరా
ద్వేషానైక్యతలు సమా
ధిలో పూడ్చరా! || ఒక్కటేరా ||
సేవవనం నాటు యద
శ్రీలు పూయగా
శ్రమామృతము చల్లు సుఖం
జాలు వారగా! || ఒక్కటేరా ||
పగిలిన ప్రతిశీల గుండె
పదిల పడెనురా
ప్రతి జాతియు స్వీయ గృహము
ప్రవేశించెరా! || ఒక్కటేరా ||
జాతి జాతి కల భారతి
జాతి మనదిర
శాంతి క్రాంతి కోరు తెలుగు
జాతి మనదిరా || ఒక్కటేరా ||
సమైక్యత విశ్వప్రేమ
గీత పాడరా
నవ్య జీవితభ్యుదయో
త్సవము సేయరా || ఒక్కటేరా ||
గోదావరి కృష్ణ నేడు
కూడి పాడగా
మహోంధ్రోందయ సౌభాగ్య
మహిమ పాడరా! || ఒక్కటేరా ||
