మూడు రంగుల జెండా

bookmark

మూడు రంగుల జెండా
ముచ్చటైన జెండా
భారతీయుల జెండా
బహు గొప్ప జెండా

అందరూ మెచ్చిన జెండా
ఆకాశంలో ఎగిరే జెండా
అంధకారం పోగొట్టిన జెండా
ఆశలు మనలో రేపిన జెండా

గాంధీతాత మెచ్చిన జెండా
నెహ్రూ గారికి నచ్చిన జెండా
భగత్ సింగ్ పట్టిన జెండా
బోసునేత ఎగరేసిన జెండా

తెల్ల దొరలను ఎదిరించిన జెండా
చల్లగా స్వరాజ్యం తెచ్చిన జెండా
అందరి మదిలో నిండిన జెండా
పింగళి వెంకయ్య ఊహల జెండా

శాంతి సహనం చూపిన జెండా
అందరి నొక్కటిగా నడిపిన జెండా
మంచి మమతలు చూపిన జెండా
ఇదే నండి మన జాతీయ జెండా