భారత దేశం మనదేరా
భారత దేశం మనదేరా
భారతీయులం మనమంతా || భారతదేశం ||
భరతుడు ఏలిన రాజ్యమురా
బుద్ధుడు పుట్టిన దేశమురా
గాంధీ, నెహ్రూ, జనని ఇందిర
రాణి రుద్రమ వెలసిన క్షేత్రం || భారతదేశం ||
ఒకటే కులముగ కలిసుంటాం
ఒకటే మతముగ నిలిచుంటాం
గాంధీతాత చెప్పిన సూక్తులు
మరవక మేము పాటిస్తాం || భారతదేశం ||
జై జవానులమై రక్షిస్తాం
జై కిసానులమై పండిస్తాం
దేశం కోసం పిల్లలమంతా
తూటాలై మేము దూసుకు వెళతాం || భారతదేశం ||
శాంతికి మేము దూతలము
దేశభక్తికి వారసులం
శత్రువు లెవరైనా మా జోలికి వస్తే
ఖబడ్దారంటు తరిమేస్తాం || భారతదేశం ||
