పురాతన భరత భూమిని

bookmark

నేను పుట్టిన నేల తల్లికి నిండుగా కై దండ లిడుదును
తల్లి గుండెల పరిమళములను తమ్ములందరి కందజేతును
భరతమాతకు చెరుపు చేసే దుష్టులను దునుమాడి గెలుతును
దేశమాత సమగ్ర సౌష్టవ రూపమును కాపాడ నిలుతును
మానవతని మంట కలిపే మత దురంతము నతికరింతును
వర్తమాన చరిత్ర తలపై గత పిశాచిని తొలగ ద్రోతును
నేలతల్లి తనూజులందరు అన్నతమ్ముల ఆత్మబంధము
పెనచి ఒకటై సంపదల సృజి యించు మంచికి పోరెదన్
లేమి నలిగే పేదలను, ధన బలము గల పీడకులు దోచని
సర్వ స్వతంత్ర సమాన ధర్మము విలసిలగ పోరాడెదన్
శ్రామికుల హాలికుల నొక్కటి చేసి, నూతన జన స్వామ్యము
ఈ పురాతన భరత భూమిని స్వర్గ తుల్య మొనర్చెదన్