పాడనా తెలుగుపాట
పాడనా తెలుగుపాట పరవశమై నే
పరవశమై మీ ఎదుట మీ పాట
కోవెల గంటల గణగణలో గోదావరి
తరంగాల గలగలలో మావుల తోపుల
మూపులపైన మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట
మధురామృతాల తేట ఒకపాట || పాడానా ||
త్యాగయ క్షేత్రయ రామదాసులు తనివితీర వినిపించినది
చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట ఒకపాట || పాడానా ||
ఒళ్ళంత ఒయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమబొట్టు
ఘల్లుఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడే
తెలుగుతల్లి పెట్టనికోట - తెలుగునాట ప్రతినోట ఒకపాట|| పాడనా ||
