నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు

bookmark

నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
నీటిలో నున్నపు డేనుఁగునైనను జయింపగల మొసలి, బయట కుక్క చేత పరాభవింపబడును. ఇది స్థానమహిమయే కాని తన మహిమ కాదు గదా ?
sri rama