చంపదగినయట్టి శ్రతువు తనచేత

bookmark

చంపదగినయట్టి శ్రతువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలుచేసి పొమ్మనుటె చాలు
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
చంపదగినట్టి పగవాడు చేజిక్కినప్పటికిని వానికి కీడు చేయరాదు. తగినంత మేలు చేసి పొమ్మనుటే వాని మనస్సు మార్చు మార్గము.