తెలుగు సూక్తులు - 12

bookmark

1. మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనకేనోయ్ - గురజాడ.

2. మతం భయాన్ని జయిస్తుంది. అది అపజయానికీ, మరణానికీ కూడా విఱుగుడు మందు.

3. మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం అంత చేరువ అవుతాము.

4. మన కర్తవ్యాన్ని ఉపేక్షిస్తే, మనమే స్వయంగా నష్టపోతాము.

5. మన దురదృష్టాలకు మూలకారణం ఇతరులలో తప్పులు వెదకడం మనలోని తప్పులను తెలుసుకోగలిగితే అనేక సుగుణాల ద్వారాలు తెరుచుకుంటాయి.

6. మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది.

7. మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి.

8. మనం ఇతరులలో లోపాన్ని ఎత్తి చూపే ముందు మనలో ఆ లోపం ఉండకుండా చూసుకోవాలి.

9. మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే, అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది.

10. మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.

11. మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.

12. మనం చదివినదంతా మరచిపోయినప్పుడు చదువే వెనుక నుండి మనల్ని బలపరిచేందుకు మిగులుతుంది.

13. మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం.

14. మనం చేసే పనిని పదిమందీ పంచుకుంటే, చేసే పని ఎంతో తేలికైపోతుంది.

15. మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.

16. మనం చేసేవి చిన్న ప్రయత్నాలైనా వ్యర్ధం కావు.

17. మనం ప్రేమించలేని వ్యక్తులను ప్రేమించడమే జీవితపు నిజమైన కష్టం అవుతుంది.

18. మనం ప్రేమించే దాన్నిబట్టి మనం తీర్చిదిద్దబడతాము, రూపు దిద్దుకుంటాము.

19. మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.

20. మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము.

21. మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే.

22. మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి.

23. మనకు జరిగేది కాదు మనలో జరిగే మార్పు గొప్పది.

24. మనకు తక్కువ జ్ఞానం ఉన్నప్పుడే విషయాలు బాగా అర్థం అవుతాయి. అధికజ్ఞానంతో పాటు సందేహం కూడా పెరుగుతుంది.

25. మనలను మనం జయించగలగడం మాత్రమే చిరకాలం నిలుస్తుంది. ఈ విజయం ఎలాంటి విచారాన్ని కలిగించదు.

26. మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం.

27. మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము

28. మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు.

29. మనల్ని మనం మన శత్రువుకంటే ఎక్కువ నిశితంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనలో మనకు కనిపించే మిత్రుడి కంటే గొప్ప మిత్రుడు ఇంకెక్కడా లేడు.

30. మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించెయ్ - స్వామి ఓంకార్.

31. మనసునిండా నిజాయతీ పెల్లుబకాలే కాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు - పండిట్ మోతీలాల్ నెహ్రూ.

32. మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్ప వాడవుతాడు.

33. మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది.

34. మనస్సును చెదిరించడం బలహీనత, మనసు లగ్నం చేయడమే శక్తి.

35. మనస్సులో అలజడి ఉన్నప్పుడు ముఖంలో ప్రశాంతత కనిపించదు.

36. మనిషి అనామకునిగా మారటానికి అహంకారం అనేది ప్రధాన కారణమవుతుంది.

37. మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు.

38. మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే.

39. మనిషి నుండి ఎన్నటికీ వేరు చేయలేని ఒకే ఒక్క సంపద విద్య.

40. మనిషి ముసలివాడై చావుకు సిద్దమై ఉన్నా అతని ఆశ మాత్రం అణగదు.

41. మనిషి యొక్క అతి విలువైన సంపదే కాలం.

42. మనిషి శరీరం కంటే ముందుగా ఆత్మని శుద్ది చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వ్యర్ధమైన జీవితం కంటే మృత్యువు శ్రేయస్కరం.

43. మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు. దీనర్ధం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. అని - అబ్రహన్ హస్ దాయ్.

44. మనిషికి విజ్ఞానం కన్నా మంచిమిత్రుడు లేడు, అఙ్ఞానం కన్నా పరమశత్రువు లేడు.

45. మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వామే అన్ని విషయాలకు మూలం.

46. మనిషిపట్ల మనిషికున్న అమానుషత్వం లెక్కలేనంత వేల మందిని విచారపడేలా చేస్తుంది.

47. మనిషిలో ఉన్న పరిపక్వతకు బాహ్యరూపమే చదువు.

48. మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.

49. మనుషుల వద్ద లేనిది ఆత్మబలమే కాని శరీర బలం మాత్రం కాదు.

50. మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము.