తెలుగు సూక్తులు - 13
1. మనోవికారాలకు గురి అయిన జీవితం ఆత్మవినాశనంతో ముగుస్తుంది.
2. మన్నించడం మంచిది, మర్చిపోవడం ఇంకా మంచిది - బ్రౌనింగ్.
3. మహనీయులకు ఆనందం ఇచ్చేది విజయం కాదు పోరాటం.
4. మహాపురుషుల జీవితాలే మానవాళికి ఉత్తమ ఉపాధ్యాలు
5. మాట ఇవ్వటానికి తొందరపడకు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడు.
6. మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లడతాయి.
7. మాటలు కాదు మనసు ముఖ్యం.
8. మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం.
9. మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది.
10. మారణాయుధాలు మనల్ని నాశనం చేయకముందే మనం వాటిని నాశనం చేయటం అవసరం.
11. మార్పు అన్నది జీవితానికి రుచినిచ్చే మసాలా లాంటిది.
12. మార్పు తప్ప ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మరేదీ లేదు.
13. మితము తప్పితే అమృతమైనా విషమే.
14. మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు.
15. మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి.
16. మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి - ఇబ్బెన్.
17. మిమ్మల్ని మీరు నిందించికోవడం మహాపాపం.
18. మీ ఆలోచనా సరళి మార్చుకుంటే ఆ మీ జీవన సరళి తానుగా మారుతుంది - డా. నార్మన్ విన్సెంట్ పీలే.
19. మీ కళ్ళద్దాలు సరిగ్గా తుడుచుకోక ఈ ప్రపంచం మురికిగా ఉందని అనకండి.
20. మీ కష్టాలను కాదు మీ దీవెనలను లెక్కపెట్టుకోండి.
21. మీ కొడుకుకు మీరు ఇవ్వగలిగిన ఒకే ఒక కానుక ఉత్సాహం.
22. మీ కోరికలు అంతులేనివైతే, మీ చింతలూ, భయాలూ కూడా అంతులేనివే - థామస్ పుల్లర్.
23. మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పేముందే మీరు ఒప్పుకోండి.
24. మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.
25. మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై వుండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే.
26. మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు.
27. మీతోటి వారి కష్టాలను గట్టెక్కించండి. మీ కష్టాలు తాముగా గట్టెక్కుతాయి.
28. మీరు ఆపలేని పనిని ప్రారంభించకండి.
29. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షమైన నీతి.
30. మీరు మంచి వారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.
31. మీరు మీరుగా ఉండండి. పక్షపాత రహితంగా సీదాసాదాగానూ, నిజాయితీతోనూ ఉండండి.
32. మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి.
33. మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ.
34. మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్దిమంతుడితో విరోధం మంచిది.
35. మూర్ఖుడు కూడా శాంతంగా ఉంటే వివేకి క్రిందే లెక్క - ఓల్డ్ టెస్ట్ మెంట్.
36. మూర్ఖుడు చివర చేసేదాన్ని వివేక వంతుడు వెంటనే చేస్తాడు.
37. మూర్ఖుల వల్ల వివేకులకు లాభమే మూర్ఖులు చేసే తప్పులు తాము చేయకుండా వారు జాగ్రత్తపడతారు.
38. మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు.
39. మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది.
40. మేథశక్తిని చూపగానే సరికాదు. హృదయ వైశాల్యం కూడా కనబరచాలి.
41. మౌనం మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం.
42. యదార్థవాది లోకవిరోధి.
43. యధార్థం తెలియని వారితో వాదించి ప్రయోజనం లేదు.
44. యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను శాంతిని కాపాడిన వారికి కుడా కీర్తి దక్కుతుంది.
45. యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప జయాలను శాంతి కూడా సాధించింది - జాన్ మిల్డన్.
46. యౌవనంలో కూడబెట్టు వార్ధక్యంలో వాడుకో.
47. రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం.
48. రాజకీయాల్లో మతం ఉండదు - లెబనీస్.
49. రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం.
50. రూపొందిచబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు.
