చెలిమి

bookmark

కానివారీతోను
కావించు చెలిమి
కట్టెవిరిచీ పొయిని
పెట్టినట్లుండు.

అయినవారీతోను
కావించు చెలిమి,
ఆకు మడచీ, మడత
పెట్టినట్లుండు.

కానివారీమాట కంట్లోది నలుసు,
ప్రాణం పోయిందాక ప్రక్కలోపోటు;
అయినవారీ మాట అమృతంపుతేట!
బ్రతికి ఉన్నందాక భాగ్యంబుమూట!