ఉన్నఊరు

bookmark

ఉన్నఊరూ విడిచి
ఉండనే లేము;
కన్నతల్లిని విడిచి
ఘడియుండలేము.

ఉన్న ఊరే నాకు
చెన్నపట్ణమ్ము;
కన్నతల్లే నాకు
కల్పవృక్షమ్ము.