అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు

bookmark

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగఁ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
అనగా అనగా (అనేక మార్లు ప్రయత్నించుటచే) రాగము వ్రుద్ధి చెందును. తినగ తినగ వేపాకు తియ్యగానుండును. కాబట్టి ప్రపంచంలో అన్ని పనులను ప్రయత్నముచే కొనసాగుచున్నవి. ప్రయత్నము చేస్తే ఏ పని అసాధ్యం కాదు.