అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గ
అల్పుఁడైన వాని కధిక భాగ్యము గల్గ
దొడ్డవారి దిట్టి తొలగఁగొట్టు
అప్పబుద్ధి వా డధికుల నెఱఁగునా
విశ్వధాభిరామ వినురమేమ.
తాత్పర్యం-
తుచ్చునకు గొప్ప సంపద కలిగినచో, పెద్దలను తిరస్కరించి తిరుగును. అలాగే తెలివి తక్కువ మూఢునకు గొప్పవాని గుణములెట్ల తెలియును.
