పొడుపు కథలు - 3

bookmark

* అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.
జ. ఆబోతు మూపురం.

* అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.
జ. పెదవులు

* మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.
జ. నిచ్చెన

* మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది.
జ. గొడుగు.

* ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు
జ. సూర్యుడు, చంద్రుడు

* బంగారు చెంబులో వెండి గచ్చకాయ
జ. పనసతొన.

* నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.
జ. తాళం.

* తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?
జ. ముళ్ల మొక్క

* బండకు కొడితే వెండి ఊడుతుంది?
జ. కొబ్బరికాయ

* వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ
జ. రామచిలుక.

1 .చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల వంటి బిడ్డలు .ఏమిటది ?
జ :మొక్కజొన్నపొత్తు.

2. కిటకిట తలుపులు కిటారి తలుపులు తియ్యావేయ్యా తీపులు లేవు . ఏమిటది ?
జ :కనురెప్పలు .

3.అడవిలో పుట్టింది ,అడవిలో పెరిగింది మాయింటి కొచ్చింది ,తైతక్కలాడింది . ఏమిటది ?
జ ;కవ్వం .

* కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.
జ. ఉల్లిపాయ

* నల్లకుక్కకు నాలుగు చెవులు
జ. లవంగం

* తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది.
జ. అత్తి చెట్టు

* తొడిమ లేని పండు, ఆకులేని పంట.
జ. విభూది పండు, ఉప్పు

* తన్ను తానే మింగి, మావమౌతుంది.
జ. మైనపు వత్తి

* చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు.
జ. అద్దం

* చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?
జ. టెంకాయ

* తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు?
జ. రైలు

* నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది?
జ. నీడ

* దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?
జ. చింతపండు