పొడుపు కథలు - 4
* ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి.
జ. తేనెపట్టు
* ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.
జ. అరిటాకు
* ఆలుకాని ఆలు.
జ. వెలయాలు
* అందంకాని అందం
జ. పరమానందం, బ్రహ్మానందం
* ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.
జ. చీమలదండు
* ఆకాశన అప్పన్న.. నేలకుప్పన్న బోడినాగన్న.. పిండి పిసకన్న
జ. వెలగపండు
* ఆకాశాన కొడవళ్లు వ్రేలాడుతున్నాయి.
జ. చింతకాయలు
* ఆ ఆటకత్తె ఎప్పుడూలోనే నాట్యం చేస్తుంది
జ. నాలుక
* ఆకాశాన పటం.. కింద తోక.
జ. గాలిపటం
* ఆకాశంలో ఎగురుతుంది. పక్షి కాదు. మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలికాదు.
జ. విమానం
* ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే
జ. ఉల్లిపాయ
* గుప్పెడు పిట్ట.. దాని పొట్టంతా తీపి.
జ. బూరె
* అడవిలో పుట్టింది, మా ఇంటికి వచ్చింది. తాడేసి కట్టింది. తైతక్కలాడింది. కడవలో దూకింది. పెరుగులో మునిగింది. వెన్నంత తెచ్చింది.
జ. కవ్వం
* దాస్తే పిడికిలో దాగుతుంది. తీస్తే ఇల్లంతా పాకుతుంది.
జ. దీపం
* జామ చెట్టు కింద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మా.
జ. నీడ
* నామముంది కాని పూజారి కాదు. వాలముది కానీ కోతి కాదు.
జ. ఉడుత
* సినిమాహాలుకి మనతో వస్తుంది. టికెట్ తీసుకుంటుంది. సినిమా చూడదు. మనం చూసి వచ్చేవరకు వేచి చూస్తుంది.
జ. మన వాఇనం
* అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం
జ. గోరింటాకు
* ఆకు చిటికెడు. కాయ మూరెడు.
జ. మునగకాయ
* ఆకు బారెడు. తోక మూరెడు.
జ. మొగలిపువ్వు
మా ఊరెద్దు మీ ఊరు పోదు ,మీ ఊరెద్దు మా ఊరు రాదు ?
జ : మైలు రాళ్లు .
* . మెడ ఉంటుంది కానీ తల ఉండదు , చేతులు ఉంటాయి కానీ వేల్లుండవు ?
జ : చొక్కా
* . అర చేతికింద అరిసె ?
జ : పిడక .
