పాముకన్న లేదు పాపిష్టి గుణము
పాముకన్న లేదు పాపిష్టి గుణము
అట్టి పాము చెప్పినట్లు వినును
ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యం-
ఈ పద్యంలో వేమన మూర్ఖుని గుణమును గురించి వివరించాడు. పాము వంటి పాపిష్టి ప్రాణియైనా చెప్పినట్లు వినును. కానీ మూర్ఖుని బుద్దిని మార్చగల సమర్థులు ఎవ్వరు లేరు.
