పాలు పంచదార పాపర పండ్లలో
పాలు పంచదార పాపర పండ్లలోఁ
జాలఁబోసి వండఁ జవికిరావు
కుటిల మానవులకు గుణమేలా కల్గురా
విశ్వధాభిరామ వినురమేమ.
తాత్పర్యం-
రుచి కోసం ఎక్కువగా పాలను, పంచదార వేసి ముష్టిపండ్లను వండినను ఎలా తీపెక్కవో, ఎన్ని ప్రయత్నములు చేసిననూ దుష్టులకు మంచి గుణము కలుగదు.
