కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి

bookmark

కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్చులెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
కొండముచ్చులన్నియు కలిసి ఒక కోతికి కొత్త గుడ్డలు కట్టి తమ రాజును జేసి సేవించినట్లుగా, నీతి నియమాలు లేని వానిని తమ నాయకునిగా చేసికొని నీచులు సేవించుందురు. అంటే బుద్దిలేని వాని దగ్గరకు వాని స్వభామము కలవారే చేరుకొందురని భావము.