హీన గుణము వాని నిలుజేర నిచ్చిన

bookmark

హీన గుణము వాని నిలుజేర నిచ్చిన
నెంతవానికైన నిడుము గలుగు
ఈఁగ కడుఁపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
నీచుని ఇంటజేర్చినచో నెంత మంచి వానికైనను కష్టము కలుగును. ఈగ కడుపులోకి పోయినచో వికారము పెట్టదా ?