మగని కాలమందు మగువ కష్టించిన
మగని కాలమందు మగువ కష్టించిన
సతుల కాలమందు సుఖమునందు
కలిమి లేని రెండు గలవెంతవారికి
విశ్వధాభిరామ వినురమేమ.
తాత్పర్యం-
మగడు (భర్త) సంపాదించి పెట్టు సమయములో కష్టపడిన స్ర్తీ, తన కొడుకులు పెరిగి పెద్దవారైన వేళ సుఖపడుచున్నది. ఎంతటి వారికైనా ధనము, దారిద్య్రయము రెండు దశలు తప్పవు.
