మంచి మాటలు - 4

bookmark

* గొప్ప విషయాలలో మనిషి తలదూర్చడం అన్నది గొప్ప అవుతుంది.
* పనికి ప్రత్యామ్నాయం లేనే లేదు. గెలుపుకు అది మీరు చెల్లించే ధర.
* అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.
* నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.
* అతి పెద్దవాడిగా తయరవడంకన్నా అతి ఉత్తముడిగా తయారవడం అన్నది ముఖ్యమైనది.
* మౌనం మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం.
* అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది.
* ఆదేశం కంటే అనుకరణ ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు.
* కేవలం రెండు విషయాలను-తాను తాగిన విషయాన్ని. తాను ప్రేమలో పడ్డ విషయాన్నీ- మనిషి దాచుకోలేడు.
*అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు – మహాత్మాగాంధి.

* . గర్వపడాల్సింది ధనవంతుడైనపుడు కాదు , ఆ డబ్బు పేదలకు ఉపయోగపడ్డపుడు.
(నెహ్రూ )
* .గొప్పవాళ్లు అవకాశాల కోసం ఎదురుచూడరు .
(సర్వేపల్లి రాధాకృష్ణన్ )
* . సంపన్నుడైన రోగికన్నా ఆరోగ్యవంతుడైన పేదవాడే అదృష్టవంతుడు .
(గాంధీజీ )
* . ఎక్కువ మంది స్నేహితులు ఉండడం కాదు .స్నేహాన్ని శాశ్వతంగా కొనసాగించడం గొప్ప .
(ఎమర్సన్ )
* . సమయపాలన పాటిస్తే సాధించలేనిది ఏదీ లేదు .
(కార్ల్ జంగ్ )
* . ఎవరూ చూడనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వం .
(రాబర్ట్ )
* . ఆత్మవిశ్వాసం ఉంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు .
(స్వామి వివేకానంద )
* . ఏకాగ్రతతో చేసిన పని సఫలమవుతుంది .
(ఆర్ధర్ కాటన్ )
* . ఎదుటివారిని విమర్శించే ముందు నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకో .
(సర్వేపల్లి రాధాకృష్ణన్ )
* .భయపడుతూ ఉంటే జీవితంలో దేన్నీ సాధించలేం .
(స్వామి వివేకానంద )
* .ప్రతిభకు ప్రాధమిక అవసరం క్రమశిక్షణ .

(బి . సి .రాయ్.)
* . ముందు చూపు లేకపోతే ఎన్నో అవకాశాలు కోల్పోతాం .
(డేవిడ్ ఫేహర్టి)
* .నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే నువ్వు వందమంది గొప్పవాళ్ల గురించి తెలుసుకోవాలి .
(సర్వేపల్లి )
* . పనిలో సంతోష రహస్యం ప్రతిభ అనే ఒక మాటలోనే ఉంది .
(పెర్ల్ బక్ )
* . దేశం అభివృద్ధి చేందడమంటె అద్దాలమేడలు ,రంగుల గోడలు కాదు .పౌరుని నైతికాభివ్రుద్దే నిజమైన దేశాభివృది.
(అంబేద్కర్ )
* .మనిషి జీవితానికి విద్య వెలుగునిస్తుంది .
(వివేకానంద ).
* .సంపాదన ముఖ్యమే, కానీ డబ్బు ఒక్కటే సంతోషాన్ని ఇవ్వలేదు .
(గాంధీజీ )
* . కోర్కెలు అనంతం . ఎన్ని తీరినా పుడుతూనే ఉంటాయి .
(రామకృష్ణ పరమహంస )
*. జవాబుదారీతనమ్ నుంచి బాధ్యత ఏర్పడుతుంది .
(స్టి ఫెన్ )
* . విద్య మొదట నమ్రత నేర్పుతుంది . తర్వాత గొప్పదనాన్ని ఇస్తుంది .
(సంస్కృత సామెత )

* . లక్ష్యంతోపాటు సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి .
(అబ్దుల్ కలాం)
* . కలత చెందకుండా ఆనందంగా ఉండగలగడమే అంతులేని సంపద .
(అబ్రహం లింకన్ )
* . ముందు చుపుగల వారు పొరపాట్లు తక్కువగా చేస్తారు .
(కన్ ప్యూషియస్)
* .ఇష్టపడి చేసే పనిలో శ్రమ తెలియదు .
(సర్వేపల్లి రాధాకృష్ణన్ )
* . వాగ్దానం చేయటంలో నిదానించు,నేరవేర్చటంలో త్వరపడు .
(సోక్రటీస్)
* . నీ దృక్పధం సరైనదైతే అదృష్టం నీ వశమౌతుంది .
(ఎమర్సన్ )
* . పిల్లల భవిష్యత్తు తల్లి దండ్రులపైనే ఆధారపడి ఉంటుంది .
(నెపోలియన్ )
* . దేవుడు సత్యమని చెప్పడం కన్నా సత్యమే భగవంతుడనటం సముచితం .
(గాంధీ )
* . అధమమైన పనులంటూ ఉండవు . అధమ దృక్పధాలు మాత్రమే ఉంటాయి.
(విల్లియం జాన్ బెన్నెట్ )
* . మంచి ప్రవర్తన అలవడాలంటే క్రమశిక్షణ నేర్చుకోవాలి .
(ఎమెర్సన్ )

* మీరు మంచివారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.
* పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది.
* మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు.
* ప్రారంభం మొత్తంలోని సగ భాగం.
* నిరాడంబరమైన,.యదార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
* అప్రయత్నంగా సాధించే గెలుపుకంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
* ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే – దేవుడే ప్రేమ.
* రోజులు తెలుసుకోలేనిదాన్ని సంవత్సరాలు ఎక్కువగా బోధిస్తాయి.
* మన్నించడం మంచిది, మర్చిపోవడం ఇంకా మంచిది – బ్రౌనింగ్.
* నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.

* సహనం బలహీనతను ప్రోత్సహిస్తుంది. అసహనం బలాన్ని నాశనం చేస్తుంది.
* ఇతరులకు అందించె సంతోషం. ఇతరుల నుండీ పొందే సంతోషం కంటే ఎక్కువ ఆనందాన్నిస్తుంది.

* ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పి పుచుతుంది.
*ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు – శామ్యూల్ జాన్సన్.
* సమకాలికులు మనిషి అర్హతను ఇతరులకు హాని చేసే ముందే క్రోధం నీకు హాని కలిగిస్తుంది.
* బంగారంలోని ప్రతి పోగూ ఎంత విలువైనదో గడచిపోతున్న కాలంలోని ప్రతి ఘడియ కూడా అంతే.
* గర్వం వినాశనానికి ముందు పోతుంది. అహంకారం పతనానికి ముందు పోతుంది.
* ఆనందం వేదన అన్నవి మానసిక స్ధితిని తెలియజేస్తాయి.
* శాంతంగా ఉండి మీరు అందర్నీ ఆజ్ఞాపించగలరు.కాదు మనిషిని ప్రశంసిస్తారు. కానీ భావితరాలుమనిషిని కాదు మనిషి అర్హతను ప్రశంసిస్తాయి.
* సహజత, సరళత జీవితాన్ని తియ్యగా చేస్తాయి.