నేనూ నా దేశం
నేనూ నా దేశం పవిత్ర భారతదేశం
అశోకుడేలిన ధర్మప్రదేశం బుద్ధుడు వెలిసిన శాంతిదేశం
బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి || అశోకు ||
కులమత బేధం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం
వందేమాతరం|| 3 || || కుల|| || నేనూ ||
కదం త్రొక్కిన వీరశివాజీ - వీర విహారిణి ఝాన్సీరాణి || 2 ||
స్వరాజ్య సమరుడు అల నేతాజీ || జైహింద్ || || 3 ||
కట్టబ్రహ్మన్న పుట్టినదేశం || నేనూ ||
అజాద్ గోఖలే వల్లభాయిపటేలు లజపతి తిలక్ నౌరోజీలు||2||
అంబులు కురిపించిన మన అల్లూరి, భగత్ రక్తము చిందిన దేశం
హిందుస్తాన్ హమారా హై || నేనూ - 3 ||
గుండ్ల తుపాకి చూపిన దొరలకు గుండె చూపే మన ఆంధ్రకేసరి
శాంతిదూత మన జవహర్ నెహ్రూ || 3 || || శాంతి ||
లాల్ బహదూర్ జన్మించిన దేశం, జై జవాన్ జై కిసాన్ || 3 || || నేనూ ||
అదిగో స్వరాజ్య రధాన సారధి - 2
ఆదర్శనారి ఇందిరాగాంధి గరీబీ హటావో || 3 ||
ఆదర్శనారి ఇందిరాగాంధి అడుగుజాడలో పయనిద్దాం
అఖండ విజయం సాధిద్దాం ఆ.. || అఖండ || || నేనూ ||
సాటిలేనిది ధీటురానిది శాంతికి నిలయం మనదేశం, నేనూ నా దేశం || 3 ||
