నీ చిన్ని నవ్వులో

bookmark

ఓ తెలుగు తల్లీ శ్రీ కల్పవల్లీ
వందనము చేకొమ్ము వందనం
హృదయ పూర్వక వందనం
మధుర కవనాలలో మహిత శిల్పాలలో
మృదుల గానములలో
ప్రతిపదంబు కళా రాజ్యాలు సృష్టించు
ప్రతిలేని బంగారు బంగారు తల్లీ!
నీ చిన్ని నవ్వులో నుప్పొంగు నదులన్నీ
నీ పలకరింపుతో పులకించు మాగాణి
నీకంటి చలువకై దివి నుండి దేవతలె
నిండు వేడుకలతో వేం చేసినారు
వీరమాతల ధాత్రి త్యాగయోగుల నేత్రి!
భవ్య జనయిత్రీ!