నాలుగుస్తంభాలాట

bookmark

నాలుగు స్తంభా లాటా,
నడిమికి తొడిమికి,
తానక తప్పక,
తన పేరేమంటే,
ఉట్టిమీద బెల్లం,
పొట్టికాకరకాయ!
బావా! బావా!
బరుకూ, బరుకూ!
తన్నులు తింటే --
తలకొకటి.
(తలకట్టు)