తెలుగు సూక్తులు - 6

bookmark

1. చదవకుండా ఉండడం కంటే పుట్టకుండా ఉండడమే మేలు కారణం అజ్ఞానమే దురదృష్టానికి మూలం.

2. చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.

3. చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం.

4. చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.

5. చదువుకోవడానికి మనిషి ఎప్పుడూ వృద్దుడు కాడు.

6. చదువులేని ఉత్సాహం గుర్రపుశాల నుండి పరిగెత్తిన గుర్రం లాంటిది

7. చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.

8. చలువరాతికి శిల్పం ఎలాగో ఆత్మకు విద్య అలాగు.

9. చాలా కొంచెంను గురించి చాలా ఎక్కువ తెలుసుకున్న వ్యక్తి నిపుణుడు.

10. చాలా తక్కువగా తినిన వారికంటే చాలా ఎక్కువగా తిన్నవారే ఎక్కువ మంది చనిపోయారు.

11. చాలామంది ఇతరులకంటే బాగా చేయగలిగిన పని తమ చేతివ్రాతను తామే చదువుకోగలగడమే.

12. చాలామంది సలహాలు తీసుకుంటారు, కానీ వివేకవంతులే దాని నుంచి లాభం పొందుతారు.

13. చింత ఎల్లప్పుడూ చిన్న వస్తువుకు పెద్ద నీడ ఇస్తుంది.

14. చితి శవాన్ని దహిస్తుంది, చింత ప్రాణాన్ని దహిస్తుంది.

15. చిత్తశుద్దిలేని విద్య ప్రమాద భరితమూ, భయానకమూ అవుతుంది

16. చిన్న అవకాశాలే తరచుగా గొప్పసాహస కార్యాలకు ప్రారంభాలు అవుతాయి.

17. చిన్న గొడ్డలి పెట్లు మహా వృక్షాలను కూల్చగలవు.

18. చిన్న చిన్న పనులే విశిష్టతను దారి తీస్తాయి. కానీ విశిష్టత చిన్నది కాదు.

19. చిన్న పని కదా అని అలక్ష్యం చేయకండి. చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకండి.

20. చిరునవ్వు ప్రతికూల పరిస్ధితులను కూడా అవకాశాలుగా మార్చగలదు

21. చీకటిలో మీరు వ్యవహరించే తీరే మీ గుణం.

22. చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?

23. చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మలను పట్టుకోండి.

24. చెడును విస్మరించి, మంచిని స్మరించి సంరక్షించుకోవటం యోగ్యతకు లక్షణం.

25. చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే.

26. చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించ లేదు.

27. చెప్పులు కుట్టేవాడు చెప్పులు అందంగా చేస్తాడు. కారణం అతను ఇంకేమి చేయడు.

28. చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.

29. చేటు కాలమునకు చెడు బుద్ది పుట్టును.

30. చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.

31. చేసిన తప్పును సమర్ధించుకోవడంతో అది రెండింతలు అవుతుంది.

32. చేసిన మేలు ఎన్నడూ గుర్తుంచుకోకు, పొందిన మేలు ఎన్నడూ మరచిపోకు.

33. జనన మరణాల మధ్యంతర కాలం జీవితం.

34. జాతికి సంపద వెండి, బంగారాలు కాదు - సజ్జనులు.

35. జాలి లేనివారే నిజమైన అంటరానివారు.

36. జీర్ణించుకోలేనన్ని నమ్మకాలు మింగకూడదు.

37. జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.

38. జీవించడం అన్నది ముఖ్యంకాదు. ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నదే ముఖ్యం.

39. జీవిత పరిజ్ఞానంలేని గ్రంధాలు నిష్ప్రయోజనాలు.

40. జీవితం అంటే గడిచిన ఏళ్ళు కాదు సాధించిన సత్కార్యాలు.

41. జీవితం అనేక సంఘటనల గొలుసు. జీవించడం అనేక అనుభవాల గొలుసు.

42. జీవితం ఎడతెరిపి లేకుండా ప్రవహించే అనుభవాల సారం.

43. జీవితం నాకు ఆలోచించడం నేర్పింది. కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు.

44. జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.

45. జీవితంలో అపూర్వ ఆభరణం వినయం.

46. జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం.

47. జీవితంలో సంఘర్షణ లేనప్పుడు కాదు, ఆ సంఘర్షణతో సర్దుకుని పోయినప్పుడే శాంతి లభిస్తుంది.

48. జీవితపు గొప్ప ముగింపు తెలుసుకోవడంలో లేదు. చేయడంలోనే ఉంది.

49. జీవితపు గొప్ప విజయాలన్నవి తరచుగా బాజాలతో కాక ప్రశాంతంగా సాధించినవే అవుతాయి.

50. జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుచుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం.