తెలుగు సూక్తులు - 18

bookmark

21. కోరికలను జయించాలి లేదా అదుపుచేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యము అవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది.

22. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది. మనము నిమిత్త మాత్రులము అంతా భగవంతుని చేతుల్లో వున్నది. మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది.

23. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది... కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు... సింహం నోరు తెరుచుకుని కుర్చున్నంత మాత్రాన వన్య మృగం దాని నోటి దగ్గరకి వస్తుందా...?

24. మనస్సును స్వాధీనపరచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది.

25. భగవద్గీత లో స్పష్టంగా వ్రాసి ఉంది!! దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరం లేదని!! బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే!!! నీవు కాదని!!!

26. దాచిపెట్టిన ధనం పరులపాలు
అందమైన దేహం అగ్నిపాలు
అస్థికలన్నీ గంగ పాలు
కొడుకు పెట్టిన తద్దినం కుడు కాకుల పాలు
నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరిపాలో?
కానీ నువ్వు చేసిన ధాన, ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు
ఇది తెలుసుకొని అందరూ బతికితే ప్రపంచమంతా శాంతి పాలు

27. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నాధనమెంత పెరిగింది అని. పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్షు లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నీ ఆయుష్షు ఇంత తరిగింది అని.

28. భగవద్గీత కు మించిన స్నేహితుడు
కాలాన్ని మించిన గురువు...
ఎక్కడ దొరకడు.

29. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు,
ఓడినవాడు విచారంగా ఉంటాడు,
అవి రెండూ శాస్వితం కాదని తెలిసిన వాడు
నిరంతరం సుఖంగా, శాంతంగా, సంతృప్తిగా ఉంటాడు.

30. ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే, ఒకరిని ద్వేషిస్తున్నాం అంటే, తనని తాను ద్వేషించుకుంటున్నట్లే, కష్టపడినచో పని పూర్తి అవుతుంది కళలు కంటూ కూర్చుంటే జీవిత కలం వృధా అవుతుంది.