తెలుగు సామెతలు-శ

bookmark

* శంకులో పోస్తే తీర్థం, పెంకులో పోస్తే నీళ్ళు.

* శంఖంలో (తో) పోస్తేగానీ తీర్థం కాదు.

* శకునంవేళ ఎక్కడికని అడుగకూడదు గానీ ఎక్కడికో చెప్పిపో అన్నట్లు.

* శక్తి ఎవరిసొమ్ము యుక్తిచే సాధింప.

* శక్తిచాలనివాడు సాధుత్వము వహించు.

* శఠగోపం లేకుంటే నా శంఠంపోయేగానీ ఇంట్కిపోయి గంటె బోర్లించుకుంటాను.

* శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.

* శతాపరాధములకు సహస్త్రదండనములు లేవు.

* శనగలు తిని చేయి కడుగుకొన్నట్లు.

* శని పట్టితే ఏడేళ్ళు, నేను పట్టితే పద్నాలుగేళ్ళు.

* శనిపీనుగా తనిగా పోదు (తనిగా=ఒంటరిగా)

* శనివారం వాన శనివారమే విడుచును.

* శని విఱగడ, పని ఒబ్బిడి.

* శనేశ్వరానికి నిద్ర ఎక్కువ, దరిద్రానికి ఆకలెక్కువ.

* శయనైకాదశి తెలిసినవాడే శాస్త్రకారుడు.

* శరణార్థిని లింగప్పా! అంటే, కందులు మూడుమాడలు అన్నాడట; చిన్నాపెద్దా బాగున్నారా? అంటే, పప్పు లక్కవలే ఉడుకుతుంది అన్నాడట.

* శరత్కాలవర్షం, గృపణుని ఔదార్యం వంటిది.

* శరము చాటేడు, చెప్పులు మూటెడు.

* శరము తప్పిన చెవులు వినరావు, గుణము తప్పిన కళ్ళు కానరావు.

* శల్య సారథ్యం.

* శవం బరువని శష్పాలు బెరికి వేసినట్లు.

* శవానికి చేసిన అలంకారం వలె.



**********:: శా ::**********

* శాంతము లేక సౌఖ్యము లేదు, దాందునికైనా, వేదాంతునికైనా.

* శాగరోకలి యిరుగు పెట్టినట్లు.

* శాపాలకు చచ్చినవాడు, దీవనలకు బ్రతికినవాడు లేడు.

* శాఫాళు ఊత్సవాలవంటివి, అవి ఊరేగి ఊరేగి బయలుదేరిన చోటుకే వచ్చిచేరును.

* శాస్త్రం తప్పు, చచ్చేది నిజం.

* శాస్త్రప్రకారం విషయిస్తే కుక్కమూతి బిడ్డలు పుట్టినట్లు.

* శాస్త్రులవారింట పుట్టి, సోమయాజుల వారింట మెట్టి, లవణమంటే దూడరేణమని (పేడని) ఎఱుగనా? అన్నదట.

* శాస్త్రులవారు కొడుకు బ్రతికి నిర్వాహకుడే, చచ్చీ నిర్వాహకుడే (నిర్వాహకుడు= మోసెవారు లేరని, బాగా నిర్వహించుకొనేవాడని అర్ధాంతరము).



**********:: శి ::**********

* శింగిడి లేస్తే పదిహేనుదినాల వర్షం (శింగిడి= ఇంద్రధనుస్సు).

* శుఖి శిఖిల మీద మిడతలు చెనసి(గి)నట్లు.

* శిర సుందగ మోకాటికి సేనలు బోసినట్లు.

* శిలాభోగం, స్థలభోగం, నరా(ర)భోగం అన్నారు.

* శివరాత్రికి చలి శివశివా! అనిపోతుంది.

* శివరాత్రికి చంక లెత్తనీయదు (చలి).

* శివరాత్రికి చింతగింజలంత చలి.

* శివరాత్రికి చింతాకంత వెట్ట.

* శివరాత్రికి జీడిపిందె, ఊగాదికి ఊరుగాయ.


* శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ.

* శివరాత్రికి శివలింగాలంత మామిడికాయలు.

* శివరాత్రి వాడింటికి ఏకాదశి వాడొచ్చినట్లు.

* శివు డియ్యకున్న సిద్ధలింగ మిచ్చునా?

* శివిడు పురుషుడైన శ్రీలకు జిక్కునా?

* శివిని ఆఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.

* శిశువుకు దక్కని స్తన్యం వలె.

* శిష్యా! శిష్యా! నా కాళ్ళకు చెప్పులున్నవా? అంటే, నక్ష్త్ర మందలం మధ్య ఎక్కడా కనపడలేదు అన్నాడట. (బిఱ్ఱుగా తిని తల వంచలేక).

* శిష్యా వెనుక గుద్దరా అంటే, వెనుక గుద్దగాక మొగముంటుందా? స్వామీ అన్నాడట శిష్యుడు.

* శిష్యున కెక్కడ సందేహమో, గురువు కక్కడే అనుమానం.


**********:: శీ ::**********

* శీలములేని సౌందర్యము తావిలేని పువ్వు వంటిది.



**********:: శు ::**********

* శుద్ధ మనసులేక పూజసేయుటే సూకరవేత్తి.

* శుభం పలకరా, పెంద్లికొడుకా! అంటే పెళ్ళికూతురుముండ ఎక్కడున్నదన్నాడట.

* శుభం పలకరా, పెంద్లికొడుకా! అంటే - పెండ్లికి వచ్చిన ముత్తైదువలంతా నా పెద్దపెండ్లాలు అన్నాడట.

* శుభం పలకరా మంకెన్నా అంటే, పెండ్లికూతురుముండ ఎక్కడ చచ్చింది అన్నాడట.

* శుభం పలకరా మంకెన్నా అంటే, ఎవడాలితాడు తెగితే నాకేమి? నాకువేసే పిండాకుడు నాకేస్తే, అయిరేని కుండలకాడ చచ్చినట్టే తొంగుంటా నన్నాడట.

* శుభం పలకరా మంకెన్నా అంటే, చెల్లిముండకు పెళ్ళెప్పుడు అన్నాడట.

* శుభాలు ముంచి, దీపాలు ఆర్పినట్లు.

* శుష్కప్రియాలు, శూన్య హస్తాలు.



**********:: శూ ::**********

* శూద్రపొట్టా తాములపాకుకట్టా, పొగాకుపట్టా, ఎప్పుడు తడుపుతూ ఉండాలి.

* శూద్ర సంతర్పణ, బ్రహ్మణ సేద్యము.



**********:: శె ::**********

* శెట్టిగారు సింగారించుకునే లోపల ఊరంతా కొల్లబోయిందట.

* శెట్టిగారూ, తుమ్మితే ఏమనుకుంటారు? అని త్రిమూర్తులు మారు వేశంలో వచ్చి అడిగితే, జలుబు చేసిందని అనుకుంటాను-అన్నాడట.

* శెట్టిగారూ, మాలో ఎవరు బాగుంటారు? అని లక్ష్మీదేవి, దరిద్రదేవి వచ్చి అడిగితే, చినక్క లోపలికి వస్తే బాగుంటుంది, పెద్దక్క బయటకిపోతే బాగుంటుంది - అన్నాడట.



**********:: శే ::**********

* శేరుదొరకు మణువుబంతు.

* శేషాయలెస్స అంటే, గరుడాయలెస్స అన్నట్లు.



**********:: శొ ::**********

* శొంఠి లేని కషాయమా?



**********:: శో ::**********

* శోభనం నాటి ముచ్చట్లు లంఖణంనాడు తలచినట్లు.



**********:: శ్మ ::**********

* శ్మశానానికి పోయిన శవం తిరిగిరాదు.



**********:: శ్యా ::**********

* శ్యామలాకారుడమ్మా! ఈ బిడ్డ శానాళ్ళు బతుకడమ్మా.

* శ్యామలకోరల పున్నానికి కోటొక్కపుఱ్ఱె బొట్టి నోముతుండట.



**********:: శ్రా ::**********

* శ్రార్ధానికి అంటు లేదు, యఙ్ఞానికి ఎంగిలి లేదు.

* శ్రావణంలో శనగల జోరు, భాద్రపదంలో బాధలపోరు.



**********:: శ్రీ ::**********

* శ్రీవైష్ణవుడు ముడ్డి చెరువులో కడగగానే అది సదాచారమగునా

* శ్రీయుతులు నన్నూట యిరవై (420) (420=భారత శిక్షాస్మృతిలో 420-వ నిబంధన మోసమునకు శిక్ష విధించునది. అంటే మోసగాడు.

* శ్రీరంగం రోకలి చేతులమీద నిలువదు.

* శ్రీరంగంలో పుట్టిన బిడ్డకు తిరువాయిమొళి నేర్పాలా? (తిరువాయిమోళి = నాలాయిరం (నాలుగువేలు) అను ద్రావిడ ప్రభందంలోని పాచురములు (పద్యములు)).

* శ్రీరంగనీతులు చెప్పేవారేగానీ, చేసేవారు లేరు.

* శ్రీరామరక్ష నూరేండ్లాయస్సు.

* శ్రీరామ లంకలో బోడికోతి.

* శ్రీరాముడు మానవాడైతే, చీడపురుగు లేమిచేస్తవి?

* శ్రీవైష్ణవుడు ముడ్డి కడిగితే, రెండుచేతులకూ పని. ( కుడిచేతితో నీళ్ళు ఎడమచేతిలో పోసుకొని కడుగుకొందురు, పురచేయి నీళ్ళను తాకి మయిల చేయరాదని).



**********:: శ్రు ::**********

* శ్రుతిమించి రాగాన పడినట్లు.

* శ్రుతిలేని పాట, సమ్మతిలేని మాట.

* శ్రుతిలేని పాట, మతిలేని మాట.



**********:: శ్వా ::**********

* శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది.



**********:: ష ::**********

* షండున కబ్బిన చాన వలె.

* షండునికి రంభ దొరకినట్లు.(నపుంసకునికి)