తెలుగు సామెతలు-మ
* మంగలంబుచేయి మంగలి హీనుడా?
* మంగలములోని పేలాల వలె.
* మంగలికత్తికి మాకులు తెగునా?
* మంగలికత్తి వాయిని (వాదరను) నాలికతో నాకినట్లు.
* మంగలి కొండోజి మేలు మంత్రులకంటెన్
* మంగలి గొరిగి నేర్చుకుంటే, వైద్యుడు చంపి నేర్చుకుంటాడు.
* మంగలిని చూచి ఎద్దు కాలు కుంటిందట.
* మంగలిపని అనుకున్నావా తడిపి దిగ గొరగడానికి? (ఎగ గొరగడానికి?)
* మంగలి పాత, చాకలి కొత్త.
* మంగలివాని కత్తికి తన చేతిలోనూ విశ్రాంతి ఉండదు, ఇతరుల చేతిలోనూ విశ్రాంతి ఉండదు.
* మంగలివాని దిబ్బ తవ్వేకొద్దీ బొచ్చే.
* మంగలివాళ్ళ పెళ్ళికి మఱొక దెబ్బ (డోలు).
* మంగళోళ్ళ ఇంటెనక బొచ్చుదిబ్బకాక మరేముంటుంది?
* మంగళగిరి మూల మాడంత మబ్బు ఏలితే ఈమని జంపనల్లో ఈతలు మోతలు.
* మంగళవారం నాడు మండెలు వేయకూడదు.
* మంచము అల్లలేని మగవాడు - మజ్జిగ చిలకలేని ఆడది.
* మంచము కోళ్ళకు, మాతామహులకు ముడివేసినట్లు.
* మంచ మున్నంతవరకు కాళ్ళు చాచుకోవాల.
* మంచ మున్న దగ్గఱే నీళ్ళాడమన్నట్లు.
* మంచముపై ముసుగులు, మనసులో విసుగులు.
* మంచముపై ఉన్నంతసేపు మగడు, కిందకి దిగితే యముడు.
* మంచ మెక్కిన మీదట మర్యాదలేల?
* మంచమెక్కి వరుస లడిగినట్లు.
* మంచమెక్కి వావి తడవినట్లు.
* మంచి ఉల్లిగడ్డకు మంచి బొడ్డు.
* మంచికాలానికి మామిళ్ళు, చెడుకాలానికి చింతలు (కాయుట).
* పంచి పగడాలు చూపి, మాయ పగడాలు అమ్మినట్లు.
* మంచికి పోతే చెడ్డ ఎదురైనట్లు.
* మంచికి పోతే మంచినీళ్ళు కూడా పుట్టవు.
* మంచి కొంచమైనా చాలు, విత్తనం చిన్నదైనా చాలు.
* మంచిగా ఉంటే నేను చేశాననుకో, మంచిగాలేకుంటే మావాడు చేశాడనుకో.
* మంచిగొడ్డు కొక దెబ్బ, మంచి మనిషి కొక మాట.
* మంచిచెడ్డలు దేవును కుడి ఎడమ చేతులు.
* మంచిచెడ్డలు పడుగు పేకలు.
* మంచి చేసిన ముంగికి ముప్పు వచ్చినట్లు.
* మంచి దున్నపోతయినా మందకొడి ఎద్దుకు సరిరాదు.
* మంచినోరు చేదు మింగినట్లు.
* మంచి పెంపు, చెడ్ద లోతు అన్ని దేశాలలో అన్ని జాతులలో సమానం.
* మంచి ప్రాణానికి మండలం వఱకు భయం లేదు (మండలం=40 దినాలు).
* మంచి మంగలైనా, ఎగ గొరిగితే మంటే.
* మంచి మంచి ముహూర్తాలు మీఇంట్లోనూనా? మాచకమ్మ సమర్తలు మాఇంట్లోనూనా?
* మంచి మంచి వారంతా మడుగులో మునిగితే, కోణంగిదాసరి కోనేటిలో మునిగెనట.
* మంచిమాటకు మంది అంతా మనవాళ్ళే.
* మంచివాడు మంచివాడంటే, మంచమంతా ఏరిగి పెట్టినాడట.
* మంచివాడు మంచివాడంటే, మంచమంతా కంతలు చేసినాడట.
* మంచివాడు మంచివాడంటే, మంచమెక్కి గంతులు వేశాడట.
* మంచివాడు మంచివాడంటే, మదురెక్కి ఉచ్చ పొశాడట.
* మంచివాడైనందుకు మరణమే శిక్ష.
* మంచివాని కొకమాట, మొరకు కొక వ్రే(ఏ)టు.
* మంచివాని చావు మరణంలో తెలుస్తుంది.
* మంచివాని గుణం మాంసం దగ్గఱ, సత్యవంతుడి గుణం చావు దగ్గఱ తెలుస్తుంది.
* మంచివానికి మాటే మందు.
* మంచివాని దగ్గఱకు మంచివారిని పంపినారు, నీదగ్గరకు నన్ను పంపినారు.
* మంచు కుంచాల కొలిచినట్లు.
* మంచుకు పెట్టిన పందిళ్ళు ముసారాకు అగునా?
* మంచుకు వేసిన పందిళ్ళు వాన కాగునా?
* మంజులాలాపము లేని కావ్యము, విలాసములేని వధూటి.
* మంటి ఎద్దయినా మా ఎద్దే గెలవాలి.
* మంటిదేవునికి మజ్జనమే సాక్షి.
* మంటిపనికైనా ఇంతివాడే వెళ్ళాలి.
* మంటిలో మానెడు, ఇంటిలో పుట్టెడు.
* మంత్రం చెప్పను మల్లుభట్లు, తినేదానికి తిప్పంభట్లు.
* మంత్రం లేని తీర్థం మరి బుక్కెడు.
* మంత్రం లేని సంధ్యకు మరి చెంబెడు నీళ్ళు.
* మంత్రంలో పసలేకపోయినా తుంపర్లకు తక్కువ లేదు.
* మంత్రజలము కంటే మంగలి జల మెచ్చు.
* మంత్రసాని తనానికి ఒప్పుకున్న తర్వాత ఏది వచ్చినా పట్టాలి.
* మంత్రసాని దెప్పులు, అత్తగారి సాధింపులు.
* మంత్రసాని పనికి ఒప్పుకున్నప్పుడు, బిడ్డ వచ్చినా పట్టాల, పియ్య వచ్చినా పట్టాల.
* మంత్రసాని ముందట మర్మం దాచినట్లు.
* మంత్రాలబువ్వ కడుపులోనికిపోతే యంత్రాలు చేయిస్తుంది, యంత్రాలున్న బువ్వ కడుపులోనికి పోతే తంత్రాలు చేయిస్తుంది.
* మంత్రాలకు మామిడికాయలు రాలుతాయా?
* మంత్రాలు తక్కువ, తుంపరు లెక్కువ.
* మందగుది ఎద్దు నడక, నత్తిమాటలు - మొదటసాగవు.
* మందబలం చూచి కుక్క మొరుగుతుంది.
* మందలింపు బెడిస్తే ముప్పు.
* మందికి చెప్పానుగానీ మనకు చెప్పానా?
* మందిని ముంచి మసీదు కట్టినట్లు.
* మంది పలుచనైతే, గంజి చిక్కన అవుతుంది.
* మంది మాటవిని మనువుపోతే, మళ్ళీ వచ్చేసరికి ఇల్లు గుల్ల అయ్యింది.
* మంది యెక్కువయితే (మోపయితే) మజ్జిగ పలుచన.
* మంది యెక్కువయితే 9లావయితే) మఠానికి చేటు.
* మందు పథ్యం, మాటకు సత్యం.
* మందుకు పోయినవాడు మాసికానికి వచ్చినట్లు.
* మందుగానీ మాకు లేదు గానీ కూర్చువా డొక్కడే కొదువ.
* మందుమాకిడి గండమాల మాంపగలేడు చక్కచేయగలడే నక్కమొర (గండమాల=మెడచుట్టు మేహగ్రంధులు లేచు వ్యాధి).
* మందూ లేదు గుండూ లేదు, తుపాకీ పట్టుక కాల్చమన్నట్లు.
* మందైనా కావాలి, ముండైనా కావాలి.
* మకరందపానంబు మధుకరాలికిగాక జోరీగలు జుఱ్ఱగలవా?
* మకురాంకు కేళికోర్చిన ముకురానన మల్లయుద్ధమున కెట్లు ఓపు.
* మక్కాకు పోయి కుక్క (బొచ్చు) మలం తెచ్చినట్లు.
* మక్కాకు పోయినా టక్కరితనం మానలేదు.
* మక్కువపడి ముక్కాలిపీటా చేయించుకుంటే, డోరియాకోక కత్తిరించుక పోయిందట.
* మగడు విడిచిన ముండ, మబ్బు విడిచిన ఎండ.
* ముఖాపంచకము సదా వంచకము.
* మగడు ఒల్లనమ్మను మారీ ఒల్లదు.
* మగడు చచ్చిన తర్వాత ముండకు బుద్ధివచ్చినట్లు.
* మగడు లేని మనువున్నదా?
* మగడు చిన్నకాగానే ముండమోపితనం తప్పునా?
* మగడు నబాబైనా బూబమ్మకు కుట్టుపోగులే (కాడలే).
* మగడు శయ్యకు పిలిచిన రాని మగువ, మిండడు వలుకులమిట్ట కీడ్చినా పోవును (వలుకులమిట్ట=వల్లకాడు).
* మగని చుట్టాలు చెప్పులు ముంగిట విడిస్తే. ఆలిచుట్టాలు అరపరమటింట్లో విడుస్తారు.
* మగని తిట్టినాపె, మరదిని మన్నించునా?
* మగనిసొమ్ము తిని, మిండని పాట పాడినట్లు.
* మగ బయిసి లేని మీసమెందుకంటే, ఎరువు నీళ్ళు లేకుండా అట్టే ఎదిగే వాటికి నేనేమి చేసేది అన్నాడట.
* మగవాడు తిరుగక చెడును, ఆడది తిరిగి చెడును.
* మగవాని పెండ్లా? ఆడదాని పెండ్లా? అంటే, అదేమో నాకు తెలియదు, గాడిపొయ్యిదగ్గర కాస్త వేస్తే గతికి వచ్చినాను అన్నాడట.
* మగవాని బ్రతుకు చిప్పనిండ మెతుకు, ఆడదాని బ్రతుకు గంజిలో మెతుకు.
* మొగాళ్ళ మెరుగులు మొగాలపైనే కనిపిస్తవి.
* మగ్గం గుంతలో పాముంది, మగాళ్ళుంటే పిలవ్వే అన్నాడట.
* మగ్గాని కొకరాయి మరవకుండా పట్టండి.
* మాఘకు మానికంత చెట్టయితే, కార్తీకానికి కడవముంతంత గుమ్మడికాయ.
* మాఘ తిమిరితే మదరుమీద కఱ్ఱైనా పండును (తిమురు=ఉఱమక మెఱయు).
* మాఘపుబ్బలు వరపయితే, మహత్తర క్షామం.
* మాఘపుబ్బలు వరపయితే,మీఅన్నసేద్యం, నాసేద్యం మన్నే.
* మాఘలో చల్లిన విత్తనాలు మచ్చలు కనబడతాయి.
* మాఘలో పుట్టి, పుబ్బలో మాడినట్లు (గిట్టినట్లు).
* మాఘలో మానెడు చల్లుటకంటె ఆశ్లేషలో అడ్డెడు చల్లుట మేలు.
* మాఘలో మానెడు, పుబ్బలో పుట్టెడు.
* మచ్చనాలుక వానికి మాట నిలకడలేదు.
* మచ్చాలు (మత్యాలు) దినే నోటికి సొచ్చాలు ఎట్లా వస్తవి? అన్నాడట.
* మజ్జిగకు వచ్చి బఱ్ఱెను బేరమాడినట్లు.
* మజ్జిగకు వచ్చి, ముంత దాచినట్లు.
* మట్టికుండలో ఉంటే మనోవ్యాధి, తోలుపొట్టలో ఉంటే తోచి ఉంటుంది.
* మట్టిగడ్డలో కప్ప కూస్తే ఒక జాములో వాన.
* మట్టిగుఱ్ఱాన్ని నమ్మి, ఏట్లో దిగినట్లు.
* మట్టిగోడ కడితే రొంపే.
* మట్టు మీరు మాటకు మారు లేదు.
* మట్టేద్దయినా మా ఎద్దే మంచిది.
* మడత కుడుములు, శేషపాంపులు.
* మడికి గట్టు, ఇంటికి గుట్టు.
* మడికి గట్టు, మాటకు గుట్టు.
* మడికి మంద, చేనుకు ఎరువు.
* మడిచారుమీద మనుపోయ, అటికెడు చారు బోర్ల పోయెనే.
* మడి దున్ని మనినవాడు, చేను చేసి చెడినవాడు లేడు.(మడీ=మాగాణి; చేను=మెట్ట).
* మడి దున్ని మహారాజైనవాడు, చేనుదున్ని చెడ్డవాడు లేడు.
* మడిన పడ్డనీరు, పైపడ్డ దెబ్బ పోవు.
* మడిమల్లేసి బిదాణం పీకేసి సరువ కోసేసి.(బిదాణం=తులసికోట; సరువ=బిందె; చెరవ=చేదుటకు ఉపయోగించునది).
* మడి బీదకాదు, రైతు పేద గాని.
* మడుగు చీరకు మసి తాకినట్లు (మడుగు=చలువచేసి మడతపెట్టిన గుడ్డ).
* మడ్డిముండకు మల్లెపూలిస్తే, మడిచి ముడ్డికింద పెట్టుకున్నదట.
* మణిని మణితో కోయవలె (వజ్రం వజ్రాన్ని భేదిస్తుంది).
* మణుం గొట్టగా మాసం చిక్కినాడు.
* మణుగు సగము, మైలా సగమే.
* మణులు చెక్కిన సంకెళ్ళ వలె.
* మతి ఎంతో గతి అంత.
* మతిమరపువాడు నీళ్ళచాయకు (చెంబొట్లకు) పోయినచోట ముడ్డి మరచివచ్చినాడట.
* మతిమరుపుల వానికి ముల్లిరుపుల వాడు.
* మతిమరుపులో నీళ్ళలో బడి, ఈదను మరచిపోయినాడట.
* మతిమీద మన్ను పోతు, ఉప్పుకు పోయి నిప్పు తెత్తు.
* మతి లేనమ్మకు గతిలేని మగడు.
* మతి లేని మాట - శృతిలేని పాట.
* మతిలెన్ని చెప్పినా మంకుబుద్ధి మానదు.
* మతు లెన్ని చెప్పినా మామపక్కనే గానీ తొంగోనన్నదట (పడుకుంటా నన్నదట).
* మదికాశ ఘటింపని మోవి, గుత్తలంజల పరమైన దీవి.
* మదిలోన నొకటి, మాటలాడు టొకటి.
* మదురుమీది పిల్లి వాటము (వలె, మాదిరి) (సమయానుకూలంగా అటొ ఇటో దూకును).
* మదురు వారమడియైనా కావలె, మాటకారి మగడైనా కావలె (వార =ఎడము, ప్రక్కన).
* మద్దులు మునిగి పార, వెంపళ్ళు తమకెంత బంటి యన్నట్లు.
* మద్దికాయలు మాటిడ్డ మాడ్కి.
* మద్దిమాను చేల్లో ఎద్దులు మేస్తే, మాముద్దలు మానునా?
* మద్దెల తాళగతులు దెలియకనే మర్ధించుట సుఖమా?
* మద్దెల బోయి రోలుతో మొరబెట్టుకొన్నట్లు.
* మద్దెలలోని ఎలుక వలె.
* మద్యపానం చేయను మడిగుడ్డ కావలెనా?
* మద్యపాయికి అనరాని మాట లేదు.
* మధ్యవైష్ణవుడు నామములకు పెద్ద.
* మనకు పులి భయం, పులికి మన భయం.
* మన గుమ్మడికాయలు మంచివైతే, బజార్లో ఎందుకు దొర్లుతుంటాయి?
* మన చల్ల మనమే పలుచన చేసుకుంటామా? (అనుకుంటామా?)
* మనదికాని పట్నం మహాపట్నం.
* మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుంటుందా?
* మన నువ్వులలో నూనె లేకపోతే, గానుగవాణ్ణి అంటే ఏమిలాభం?
* మన బంగారం మంచిదైతే, కంసాలి ఏమిచేయగలడు?
* మన మెఱుగని చెవులకు మద్దికాయలా?
* మనసిచ్చీ మనసివ్వక (మనసురాక) మనువుకుబోతే నిలుచున్నట్లే నిద్రవచ్చిందట.
* మనసుకు నచ్చినవాడు మగడుగానీ మంగళసూత్రం కట్టగానే మగడుగాడు.
* మనసు విరిగితే అతుక్కోవచ్చునిగానీ కుండపగిలితే అతుకరాదు.
* మనసుంటే మార్గముంటుంది.
* మనసు కుదిరితే మల్లి, మనసు కుదరకుంటే ఎల్లి.
* మనసు దిద్దరాదు మహిమీద నెవనికి.
* మనసు మండిగెలు చేసుకుంటే గోధుమ లేవడిస్తాడు?
* మనసు మహామేరువు దాటును, కాలు కందకం దాటదు (గడప దాటలేదు).
* మనసున నాటిన మాటలు చెరపలేరు.
* మనసునిల్ప శక్తిలేకపోతే మంచివిరుల పూజేమి చేయును?
* మనసులేని మనువు వలె.
* మనసులేనివాని మంత్రంబు లేలయా?
* మనసులోని వెతకు మందు లేదు.
* మనసులోని మర్మం చాటుకొనే మానవుడు మాతలు నేర్చినాడు.
* మనసులోని మర్మం నీళ్ళలోని లోతు ఎరుగలేరు.
* మనసులోని మర్మం ముఖమే వెల్లడించును.
* మనసు విరిగెనేని మరియంట నేర్చునా?
* మనసెఱుగని కల్లా, ఒళ్ళెరుగని సివమా? (ఉండవనుట).
* మనసో మామగారి తద్దినమో అన్నారు.
* మనస్సుకు మనస్సే సాక్షి.
* మనస్సులో ఎంత ఉంటే, సోదెలో అంతే వస్తుంది.
* మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతంత్రములేల?
* మన ఉన్న ప్రాణాన్ని మంట గలిపినట్లు.
* మనిషి ఉన్ననాడు మజ్జిగ లేదు, ఒలికమీద కట్టివేయను పాడిఆవు (ఒలికి=స్మశానము).
* మనిషి కాటుకు మందులేదు.
* మనిషి కోతి అయ్యే దెప్పుడంటే తానద్దం చూచుకొనేటప్పుడు
* మనిషి మంచిచెడ్డలు తెలుసుకోవాలంటే అతనిని అధికారపీఠంలో పెట్టాలి.
* మనిషికి ఉన్నది పుష్టి, పసరానికి తిన్నది పుష్టి.
* మనిషికి ఒకమాట, పండు కొక రుచి (పశువు కొక దెబ్బ).
* మనిషికి గాక కష్టాలు మాకులకు వస్తవా?
* మనిషికి మాటే అలంకారము.
* మనిషి కొక తెగులు మహిలో వేమ అన్నారు.
* మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ.
* మనిషి గబ్బు మారుమారు, నా గబ్బు తీరుతీరు.
* మనిషి చస్తే మాట మిగులుతుంది, ఎద్దు చస్తే ఎముక మిగులుతుంది.
* మనిషి తిండిమోయన దున్నపోతు తిండి-దెయ్యపు తిండి మధ్యన.
* మనిషి పేదయితే, మాటకు పేదా?
* మనిషి పోచికోలు కాడు (పోచికోలు=వృద్ధుడు).
* మనిషి బొమ్మవ్రాసి క్రింద మనిషి అని ఎందుకు వ్రాసావంటే, లేకుంటే కోతి అనుకుంటా రన్నాడట.
* మనిషి మంచిదే కానీ గుణం గుడిసేటిది.
* మనిషి మర్మము, మాని చేవ బయటకి తెలియవు.
* మనిషి మీద పీడ మహిమీద పోయింది.
* మనుగ(గు)డుపు పెండ్లికొడుకు వలె.
* మనుగుడుపు నాటి మాటలు మనివిన నాడుండవు.
* మనుజుడొకటి తలంప దైవమొకటి తలంచు.
* మనువు చెడి ముండ బుద్ధిమంతురాలయింది
* మనువు నిత్యం కాదు, ఏకులరాట్నం అమ్మబోకు అన్నట్లు.
* మనువును నమ్ముకొని బొంత బోర్ల (పొయ్యిలో) వెసుకొన్నట్లు.
* మను వొక్కచోట మనసు ఇంకొకచోట.
* మనుషు లందరి తలపైనా మంగలి చేయ్యి.
* మనుషులు పోయినా మాటలు నిలుస్తాయి.
* మనోవ్యాధికి మందు లేదు.
* మన్ననలేని మహీపతి కొలువు, లాలన లేని లంజ పొందు ఒకటే.
* మన్ను తిని మంచినీళ్ళు త్రాగినట్లు.
* మన్ను తిన్న పాము వలె.
* మన్నును నమ్మి దున్నినవాడే మన్నీడు.
* మన్ను పట్టితే బంగారం, బంగారం పట్టితే మన్ను.
* మన్ను, మిన్ను మెత్తనయితే మనుష్యులకు బ్రతుకు.
* మన్ను వెళ్ళకుండా దున్నితే, వెన్ను వెళ్ళకుండా పండును.
* మన్మథవేదనకు, మందబుద్ధికి మందులేదు.
* మన్మధుడే పురుషుడైనా మాయలాడి తన మంకుబుద్ధి మానదు.
* మన్యం మఱిగిన మనిషి, మాదిగాడ (మాదిగపల్లి) మఱగిన కుక్క వెనక్కి రావు.
* మప్పడం (మరపడం) తేలికే గానీ తిప్పడం కష్టం.
* మబ్బును వెతుక్కుంటూ పైరుపోదు, ఆవును వెతుక్కుంటూ దూడపోదు.
* మబ్బులు చెదిరిపోయినా వాననీరు నిలిచే ఉంటుంది.
* మబ్బులో పొద్దు మాయమైపోతే, కోడళ్ళ ప్రాణాలు కొలికిళ్ళకొచ్చె.
* మప్పులో పొద్దు మగడాలిని చెఱచును.
* మమత విడువకున్న మానునా మానంబు.
* మరుగుజ్జు మహామేరువు ఎక్కినా మరుగుజ్జే.
* మరుదండపు మిడిసిపాటు మననీయదు.
* మరుదండమునకు విలసనములు మెండు
* మఱచిపోయి చచ్చినాను, ప్రాణమా! రమ్మంటే వస్తుందా?
* మఱచిపోయి మజ్జిగలో చల్లపోశాను అన్నట్లు
* మఱచిపోయి మజ్జిగలో చేమిరి వేసినట్లు (చేమిరి=తోడు పెట్టుట).
* మఱచిపోయి మారుబొట్టులో మజ్జిగ పోసినానన్నట్లు (మారుబొట్టు=మజ్జిగ).
* మరుగుభాషపై మన్నుపొయ్యి, గంజిలో ఇంత ఉప్పెయ్యి.
* మరులున్న వాడే మగడు.
* మరువముతోనే పరిమళము.
* మర్యాదకుపోతే మానం దక్కదు.
* మర్యాదరామన్న మాట తప్పినా, నా వేటు తప్పదు.
* మఱ్ఱిచెట్టుక్రింద మొక్కలు మొలవవు, అయ్యక్రింద ఎవ్వరు ముందుకురారు.
* మల నల్లబడితే వాన, చన్ను నల్ల బడితే బిడ్డ.
* మలప గేదే మానెడు ఇచ్చును.
* మలపసన్యాసికి మాచకమ్మకు జత.
* మలబారులో చెవులు కుడుతారని మాయవరం నుంచి చెవులు మూసికొని పోయినట్లు.
* మలలు మింగే మహదేవునికి తలుపొక అప్పడం.
* మలుగులు క్రుంగితే (గుంజితే) మావటికి ఈనును (చూడుపసరం) (మలుగు= ముడ్డికీలు భాగం).
* మల్ల తెచ్చుకో అయ్యా! అంటే మఱింత బువ్వెట్టు అన్నట్లు.
* మల్లిని చెయ్యబోతే పిల్లి అయినట్లు.
* మల్లీ! మల్లీ! మంచానికి కాళ్ళెన్ని? అంటే, మూడున్నొకటి అన్నదట.
* మల్లె పట్టిన చేమవలె (మల్లె= ఒక చీడ వంటి కలుపు).
* మసిపాతలో మాణిక్య మట్లు.
* మసిపూసి మారేడును నేరేడు చేసినట్లు.
* మసిబొగ్గు కస్తూరి మహిమ దీపించినా పరిమళానంద సౌభాగ్య మీదు.
* మసి మొగము వాడు, చమురు కాళ్ళ వాడు పోగయినట్లు.
* మసీదికాలె మదార్ సాబ్ అంటే, సందెడు బొంతలు చంకనున్నాయి అన్నాడట.
* మహాంతమైన లొల్లి మానెడు వడ్లు అలుకదు.
* మహాభారంలో ఆదిపర్వతం అన్నట్లు.
* మహామహావాళ్ళు మడుగులో పడుతుంటే కోణంగి దాసరి కోనేటిలో పడెనంట.
* మహామహావాళ్ళు మదుళ్ళకింద ఉంటే పుల్లాకు నా గతేమి అన్నదట.
* మహామహావాళ్ళు మదుళ్ళకింద ఉంటే, గోడ చాటు వారికి శరణు శరణు.
* మహామహావాళ్ళు మన్ను మూకుళ్ళు అయిత్యే, నీవొక జల్లిమూకుడివి.
* మహారాజావారని మనవిచేసుకుంటే, మరి రెండు వడ్డించ మన్నాడట.
* మహారాజుకైనా మన్ను నమ్మిన వాడే అన్నం పెట్టాలి.
* మహారాజు పెంతదింటే మందుకు, పేదవాడు తింటే కూడులేక అన్నట్లు.
* మహారాజులమే కాని, పొయ్యి రాజదు.
* మహాలక్ష్మి పండుగకు మాడెత్తు చలి.
* మహావృక్షం క్రింద మొక్కలు పెఱుగవు.
**********:: మా ::**********
* మాంసం తింటామని ఎముకలు మెడకు కట్టుకుంటామా?
* మాంసం తింటాడని పేగులు మెడలో వేసుకుంటాడా?
* మాంసం తినేవాడు పోతే, బొమికెలు తినేవాడు వస్తాడు.
* మాంసం మాంసాన్ని పెంచుతుంది.
* మాంసమంటే సైసుయ్ పైసలంటే కైకుయ్
* మా ఆయనే ఉంటే, మంగలివాణ్ణి అయినా పిలుచుకు వచ్చేవారు కదా.
* మా ఇంటాయనకు మగతనముంటే, పొరుగింటాయన పొందెందుకు?
* మా యింటికొస్తే మాకేం తెస్తావు? మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తావు?
* మా కాయుష్యమస్తు! మా కారోగ్యమస్తు! అని దీవించుకొనినట్లు.
* మాకు కుడుము, మీకు వక్క (మూకుడు).
* మాగి చెడ్డ గొడ్డు మాదిగింటికైనా తగదు.
* మాగి పొద్దు మాటాడ దీరదు.
* మాగిలి దున్నితే మరింత పంట.
* మాగిలి దున్నితే మాలవానికైనా పైరగును.
* మాఘ(ఖ) ,మాసపు చలి మంటలో పడ్డా తీరదు.
* మాఘమాసపు వాన - మగడులేని చాన.
* మాఘమాసంలో మ్రాకులు సైతం వణకును.
* మాచకమ్మ సమర్త మఖయితే నేమి? పుబ్బయితే నేమి? మఱి పునర్వసైతే నేని?
* మాచకమ్మకు మరునింట నాచు మెండు; వంధ్యకు మైథునేచ్చ మెండు.
* మాచకమ్మకు ముత్యాలసర మదేల?
* మా చక్కెరతో మీ పొంగ లెందుకు వండాలి?
* మాచర్ల దొరలకు మీసాలు లేవు, పల్నాటి దొరలకు వాసాలు లేవు.
* మాటంటే మహరాజుగూడ నిలబడతాడు.
* మాటకారి నీటుకాడు.
* మాటకు పడిచస్తాము కానీ, మూటకు పడి చస్తామా?
* మాటకు ప్రాణము సత్యము, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణము వ్రాలు.
* మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి.
* మాటకు మాట తెగులు, నీటికి నాచు (పాచి) తెగులు.
* మాటకు మాట శృంగారం, పేటకు కోట శృంగారం.
* మాటకు ముందు ఏడ్చె మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మరాదు.
* మాటకు సొంపు, పాటకు ఇంపు.
* మాటగొప్ప చెప్ప మాటలు చాలవు.
* మాట గొప్ప మానిక పిచ్చ.
* మాట చుట్టమే గానీ, పూట చుట్టం కాదు.
* మాట చూదనిదే మనసీయరాదు.
* మాత మాటకు తప్పు, జోడి నెత్తిన ముప్పు.
* మాటలకు మల్లి, చేతలకు ఎల్లి.
* మాటలకు మా ఇంట్లో, మాపటికి మీ ఇంట్లో.
* మాటలకు ఆ-లకు పేదరికం లేదు.
* మాటల తేటలు(తీపి) మా ఇంటికాడ, మాపటితిండి మీ ఇంటికాడ.
* మాటలచేత భూపతులు మన్ననలిత్తురు.
* మాటలచేత మన్ననలు పొందవచ్చును.
* మాటలచేత మహాకాళిని నవ్వించవచ్చు.
* మాటలచేత మహారాజుబిడ్డను మనువు తెచ్చుకోవచ్చు.
* మాటలచేత మాన్యాలు సంపాదించవచ్చు.
* మాటలతో మూటలు కొనవచ్చు.
* మాటల పసేగానీ చేతల పస లేదు.
* మాటలలోనే మనుబోలువారు పిడూరు దాటినట్లు.
* మాటలలోపడి మగనిని మఱచినట్లు.
* మాటల సత్రానికి నాదో పల్లా (నాదొక బస్తా) (పల్లా= ఒక కొలమానిక).
* మాటలు ఆకులు, చేతలు పండ్లు (కాయలు).
* మాటలు ఎప్పుడు నిలుపాలనో తెలియనివాడే వదరుబోతు (వాయాడి).
* మాటలు కోటలు దాటును, కాలు గడప దాటదు.
* మాటలుచెప్పే మొనగాండ్లేగానీ, పూట బత్తెమిచ్చే పుణ్యాత్ములు లేరు.
* మాటలు తల్లిమాటలు, పెట్టు సవతితల్లి పెట్టు.
* మాటలు నేరకున్న నవమానము అన్యము మానభంగమున్.
* మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకపోతే, ఇసుకో అంటే ఇసుకో అన్నదట.
* మాటలు నేర్చినమ్మ ఏడ్చినా ఒక సొంపే (బాగుంటుంది).
* మాటలు నేర్వలేకపోతే, పూటలు గడువవు.
* మాటలు పోయినాక, మూటలు పనికిరావు.
* మాటలు మంచి, చేతలు చెడ్డ.
* మాటలేగానీ చొరనీదు మాచకమ్మ.
* మాటలే మంత్రాలు, మాకులే మందులు.
* మాటలో నీటుంది, మాటలో పోటుంది, మాటలో సూటి ఉంది.
* మాట వెండి, మౌనం బంగారం.
* మాటే లేకుంటే చోటే లేదు.
* మాట్లాడ నేరిస్తే, పోట్లాడరాదు (పోట్లాడ పనిలేదు).
* మాట్లాడితే మరామేకు (మరచీల).
* మాట్లాడితే మల్లెలు, కాట్లాడితే కందు(తి)రీగలు.
* మాట్లాడుతుంటే వచ్చేవి మాటలు, గోరాడుతుంటే వచ్చేవి వెంట్రుకలు (బొచ్చు).
* మాట్లాడే వానికి వినే వానికి అర్థం కానిదే వేదాంతం.
* మాడపన్ను కొరకు మహిషంబు నమ్మితి, మడమనూరి వృత్తి మాలవృత్తి.
* ' మాణవా ధీశర, మణువు నాలికవాడు ' అని సెట్టిగారు పురాణం చదివితే, ' అబ్బో! అంత పెద్ద నాలిక ఎవరికుంది? ' అని ప్రశ్నించగా, ' ఇనుము యిదర్భదేశమున యీరుడికుండెను ' అన్నాడట ఇంకొక శ్రోత.
* మానిక్యం పోయి, పసిపాత దొరికినట్లు.
* మాణిక్యానికి మసి పూసినట్లు.
* మాతకు గజ్జలాడితే, మాదిగకు సివమెత్తుతుంది.(మాత= పెండ్లి లేకుండా జాతరలో సిందువేయు మాదిగ స్త్రీ).
* మాతాతలు నేతులు తాగారోయి, మా మూతులు వాస్న చూడండొయ్.
* మాదాకవళమమ్మా! అంటే మా ఇంటాయన నీకు కనుపించలేదా? అన్నదట.
* మాదిగ మంచానికి కాళ్ళవైపూ ఒకటే, తలవైపూ ఒకటే.
* మాదిగ మంపు మాపటిదాక, కాపు మంపు కపిల వేళదాక (మంపు=మాంద్యము, మత్తు; కపిల=మోట).
* మాదిగ మల్లి, కంసాలి ఎల్లి (మల్లి=మళ్ళీ రమ్మనుట; ఎల్లి=రేపు రమ్మనుట).
* మాదిగవాని బ్రతుకు ముదురుమీద గడ్డి ఒకటే.
* మాదిగవాని ఆలయినా, మాడే కాలికి చెప్పు లేదు.
* మాదేవుని సత్యం మాకు తెలియదా?
* మా దొబ్బే రెడ్డి వచ్చాడు, కోళ్ళ గూటిలో మంచంచేయి అన్నత్లు.
* మాధవభట్లకు పడిశము ఏటా రెండుమార్లు రావటమూ, వచ్చినప్పుడల్లా ఆరేసి నెలలుండటము.
* మాధుకరం వానింటికి ఉపాదానం వాడు పోయినట్లు.
* మాధ్వులకు భుక్తి, వైష్ణవులకు భక్తి, అద్వైతులకు యుక్తి.
* మానంది (మహానంది)తిరుణాళ్ళమన్నాయె గాని, ఏట్లో పడుకుంటే నోట్లో చేసిపోయినారు.
* మానం పోయిన వెనుక ప్రాణ మెందుకు.
* మానవ సేవే మాధవ సేవ.
* మానవ జీవితాన్ని పాలించేది విధేగానీ విఙ్ఞానం కాదు.
* మానవుడు తాను చేసిన పనిముట్టుకే పనిముట్టయి పోతున్నాడు.
* మానవు లుందరు గానీ, మాటలు ఉండి (నిలచి) పోతవి.
* మానికకు కరవు లేదు, కోమటికి పరువు లేదు.
* మానిన పుండును మళ్ళీ రేపినట్లు.
* మానిన పుండు మళ్ళి సెలపోసినట్లు (సెలపోయు=తిరిగి చీము పోయు).
* మానిన రోగానికి మందు వద్దు, ఈనిన కుక్క ఇంత ఉన్నది వైద్యుడా! అన్నాడట.
* మానిన పండ్లు మాని కిందనే పడును (రాలును).
* మాన్పిందే మందు, మాంపినవాడే వెజ్జు.
* మాన్పిందే మందు, బ్రతికిందే ఊరు.
* మానుకొద్దీ చెక్కు తీయాలి.
* మానుగొట్టి మీద ద్రోసికొన్నట్లు.
* మానుపిల్లి అయినా మట్టిపిల్లి అయినా ఎలుకను పట్టిందే పిల్లి.
* మానుమాను దిరుగు మహికోతి కైవడి.
* మానెడు గింజలకు పనికి బోతే కుంచెడు గింజలు దూడ తినిపోయిందట.
* మానెడు పిండవచ్చును గానీ, చిట్టెడు తిరిగి ఎక్కించలేము.
* మానెడు మంటిలో పోసుకుంటే, ఇద్దుము యింటిలో పోసుకుంటారు.
* మానేదానికి మండేలా? మానని దానికి మందేలా?
* మా పిల్లవానికి ముప్ఫైరెండు గుణాలున్నవిగానీ, రెండుమాత్రం తక్కువ.
* మా బావ వామహస్తానికి తోడు చాదస్తం.
* మాబఱ్ఱె చస్తే చచ్చింది గానీ, పెద్దాయన బఱ్ఱె పాలివ్వకపోతే చాలు.
* మాబూసాహేబ్ పెండ్లామైతేనేమి? బాబూసాహేబ్ పెండ్లామైతే నేమి? మన ఇంట్లో పాచిపని మతకం లేకుండా చేస్తే చాలు.
* మామతో కూడా మంచమల్లి, తాతతో కూడ తడక కట్టటానికి వచ్చిందట.
* మామతో గూడ వేడన్నంతిని, అక్కతో గూడ పైటన్నం తిని, అమ్మతో గూడ అంబలి తాగేవాడు.
* మామ బంతికి కూర్చొని, అత్తబంతికి లేస్తాడు.
* మామా ఒక ఇంటి అల్లుడే! అత్తా ఒక ఇంటి కోడలే.
* మాచకమ్మ సమర్త మఖయితే నేమి? పుబ్బయితే నేమి? మఱి పునర్వసైతే నేని?
* మాచకమ్మకు మరునింట నాచు మెండు; వంధ్యకు మైథునేచ్చ మెండు.
* మాచకమ్మకు ముత్యాలసర మదేల?
* మా చక్కెరతో మీ పొంగ లెందుకు వండాలి?
* మాచర్ల దొరలకు మీసాలు లేవు, పల్నాటి దొరలకు వాసాలు లేవు.
* మాటంటే మహరాజుగూడ నిలబడతాడు.
* మాటకారి నీటుకాడు.
* మాటకు పడిచస్తాము కానీ, మూటకు పడి చస్తామా?
* మాటకు ప్రాణము సత్యము, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణము వ్రాలు.
* మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి.
* మాటకు మాట తెగులు, నీటికి నాచు (పాచి) తెగులు.
* మాటకు మాట శృంగారం, పేటకు కోట శృంగారం.
* మాటకు ముందు ఏడ్చె మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మరాదు.
* మాటకు సొంపు, పాటకు ఇంపు.
* మాటగొప్ప చెప్ప మాటలు చాలవు.
* మాట గొప్ప మానిక పిచ్చ.
* మాట చుట్టమే గానీ, పూట చుట్టం కాదు.
* మాట చూదనిదే మనసీయరాదు.
* మాత మాటకు తప్పు, జోడి నెత్తిన ముప్పు.
* మాటలకు మల్లి, చేతలకు ఎల్లి.
* మాటలకు మా ఇంట్లో, మాపటికి మీ ఇంట్లో.
* మాటలకు ఆ-లకు పేదరికం లేదు.
* మాటల తేటలు(తీపి) మా ఇంటికాడ, మాపటితిండి మీ ఇంటికాడ.
* మాటలచేత భూపతులు మన్ననలిత్తురు.
* మాటలచేత మన్ననలు పొందవచ్చును.
* మాటలచేత మహాకాళిని నవ్వించవచ్చు.
* మాటలచేత మహారాజుబిడ్డను మనువు తెచ్చుకోవచ్చు.
* మాటలచేత మాన్యాలు సంపాదించవచ్చు.
* మాటలతో మూటలు కొనవచ్చు.
* మాటల పసేగానీ చేతల పస లేదు.
* మాటలలోనే మనుబోలువారు పిడూరు దాటినట్లు.
* మాటలలోపడి మగనిని మఱచినట్లు.
* మాటల సత్రానికి నాదో పల్లా (నాదొక బస్తా) (పల్లా= ఒక కొలమానిక).
* మాటలు ఆకులు, చేతలు పండ్లు (కాయలు).
* మాటలు ఎప్పుడు నిలుపాలనో తెలియనివాడే వదరుబోతు (వాయాడి).
* మాటలు కోటలు దాటును, కాలు గడప దాటదు.
* మాటలుచెప్పే మొనగాండ్లేగానీ, పూట బత్తెమిచ్చే పుణ్యాత్ములు లేరు.
* మాటలు తల్లిమాటలు, పెట్టు సవతితల్లి పెట్టు.
* మాటలు నేరకున్న నవమానము అన్యము మానభంగమున్.
* మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకపోతే, ఇసుకో అంటే ఇసుకో అన్నదట.
* మాటలు నేర్చినమ్మ ఏడ్చినా ఒక సొంపే (బాగుంటుంది).
* మాటలు నేర్వలేకపోతే, పూటలు గడువవు.
* మాటలు పోయినాక, మూటలు పనికిరావు.
* మాటలు మంచి, చేతలు చెడ్డ.
* మాటలేగానీ చొరనీదు మాచకమ్మ.
* మాటలే మంత్రాలు, మాకులే మందులు.
* మాటలో నీటుంది, మాటలో పోటుంది, మాటలో సూటి ఉంది.
* మాట వెండి, మౌనం బంగారం.
* మాటే లేకుంటే చోటే లేదు.
* మాట్లాడ నేరిస్తే, పోట్లాడరాదు (పోట్లాడ పనిలేదు).
* మాట్లాడితే మరామేకు (మరచీల).
* మాట్లాడితే మల్లెలు, కాట్లాడితే కందు(తి)రీగలు.
* మాట్లాడుతుంటే వచ్చేవి మాటలు, గోరాడుతుంటే వచ్చేవి వెంట్రుకలు (బొచ్చు).
* మాట్లాడే వానికి వినే వానికి అర్థం కానిదే వేదాంతం.
* మాడపన్ను కొరకు మహిషంబు నమ్మితి, మడమనూరి వృత్తి మాలవృత్తి.
* ' మాణవా ధీశర, మణువు నాలికవాడు ' అని సెట్టిగారు పురాణం చదివితే, ' అబ్బో! అంత పెద్ద నాలిక ఎవరికుంది? ' అని ప్రశ్నించగా, ' ఇనుము యిదర్భదేశమున యీరుడికుండెను ' అన్నాడట ఇంకొక శ్రోత.
* మానిక్యం పోయి, పసిపాత దొరికినట్లు.
* మాణిక్యానికి మసి పూసినట్లు.
* మాతకు గజ్జలాడితే, మాదిగకు సివమెత్తుతుంది.(మాత= పెండ్లి లేకుండా జాతరలో సిందువేయు మాదిగ స్త్రీ).
* మాతాతలు నేతులు తాగారోయి, మా మూతులు వాస్న చూడండొయ్.
* మాదాకవళమమ్మా! అంటే మా ఇంటాయన నీకు కనుపించలేదా? అన్నదట.
* మాదిగ మంచానికి కాళ్ళవైపూ ఒకటే, తలవైపూ ఒకటే.
* మాదిగ మంపు మాపటిదాక, కాపు మంపు కపిల వేళదాక (మంపు=మాంద్యము, మత్తు; కపిల=మోట).
* మాదిగ మల్లి, కంసాలి ఎల్లి (మల్లి=మళ్ళీ రమ్మనుట; ఎల్లి=రేపు రమ్మనుట).
* మాదిగవాని బ్రతుకు ముదురుమీద గడ్డి ఒకటే.
* మాదిగవాని ఆలయినా, మాడే కాలికి చెప్పు లేదు.
* మాదేవుని సత్యం మాకు తెలియదా?
* మా దొబ్బే రెడ్డి వచ్చాడు, కోళ్ళ గూటిలో మంచంచేయి అన్నత్లు.
* మాధవభట్లకు పడిశము ఏటా రెండుమార్లు రావటమూ, వచ్చినప్పుడల్లా ఆరేసి నెలలుండటము.
* మాధుకరం వానింటికి ఉపాదానం వాడు పోయినట్లు.
* మాధ్వులకు భుక్తి, వైష్ణవులకు భక్తి, అద్వైతులకు యుక్తి.
* మానంది (మహానంది)తిరుణాళ్ళమన్నాయె గాని, ఏట్లో పడుకుంటే నోట్లో చేసిపోయినారు.
* మానం పోయిన వెనుక ప్రాణ మెందుకు.
* మానవ సేవే మాధవ సేవ.
* మానవ జీవితాన్ని పాలించేది విధేగానీ విఙ్ఞానం కాదు.
* మానవుడు తాను చేసిన పనిముట్టుకే పనిముట్టయి పోతున్నాడు.
* మానవు లుందరు గానీ, మాటలు ఉండి (నిలచి) పోతవి.
* మానికకు కరవు లేదు, కోమటికి పరువు లేదు.
* మానిన పుండును మళ్ళీ రేపినట్లు.
* మానిన పుండు మళ్ళి సెలపోసినట్లు (సెలపోయు=తిరిగి చీము పోయు
* మానిన రోగానికి మందు వద్దు, ఈనిన కుక్క ఇంత ఉన్నది వైద్యుడా! అన్నాడట.
* మానిన పండ్లు మాని కిందనే పడును (రాలును).
* మాన్పిందే మందు, మాంపినవాడే వెజ్జు.
* మాన్పిందే మందు, బ్రతికిందే ఊరు.
* మానుకొద్దీ చెక్కు తీయాలి.
* మానుగొట్టి మీద ద్రోసికొన్నట్లు.
* మానుపిల్లి అయినా మట్టిపిల్లి అయినా ఎలుకను పట్టిందే పిల్లి.
* మానుమాను దిరుగు మహికోతి కైవడి.
* మానెడు గింజలకు పనికి బోతే కుంచెడు గింజలు దూడ తినిపోయిందట.
* మానెడు పిండవచ్చును గానీ, చిట్టెడు తిరిగి ఎక్కించలేము.
* మానెడు మంటిలో పోసుకుంటే, ఇద్దుము యింటిలో పోసుకుంటారు.
* మానేదానికి మండేలా? మానని దానికి మందేలా?
* మా పిల్లవానికి ముప్ఫైరెండు గుణాలున్నవిగానీ, రెండుమాత్రం తక్కువ.
* మా బావ వామహస్తానికి తోడు చాదస్తం.
* మాబఱ్ఱె చస్తే చచ్చింది గానీ, పెద్దాయన బఱ్ఱె పాలివ్వకపోతే చాలు.
* మాబూసాహేబ్ పెండ్లామైతేనేమి? బాబూసాహేబ్ పెండ్లామైతే నేమి? మన ఇంట్లో పాచిపని మతకం లేకుండా చేస్తే చాలు.
* మామతో కూడా మంచమల్లి, తాతతో కూడ తడక కట్టటానికి వచ్చిందట.
* మామతో గూడ వేడన్నంతిని, అక్కతో గూడ పైటన్నం తిని, అమ్మతో గూడ అంబలి తాగేవాడు.
* మామ బంతికి కూర్చొని, అత్తబంతికి లేస్తాడు.
* మామా ఒక ఇంటి అల్లుడే! అత్తా ఒక ఇంటి కోడలే.
* మామా! మామా! గోచి ఊడిందేమి? అని వదినె మరదళ్ళు అంటే, మిమ్మల చూచే లేండి, ఊరుకొండి- అన్నాడట.
* మామిడికాయలు తరిగితే, కత్తిపీట వాదర పులుస్తుందా?
* మామిడిచెట్టుకు మడిగుడ్డ కట్టి, దొంగలు ఎక్కరులే అన్నట్లు.
* మామిడి మగ్గితే సజ్జలు పండును.
* మామిళ్ళ కాఙ్ఞ గానీ, గుగ్గిళ్ళకు ఆఙ్ఞా?
* మామిళ్ళకు మరణాలు, చింతలకు సిరులు (మామిడికాపు ఎక్కువైన సంవత్సరం అరిష్టము, చింతకాపు ఎక్కువైన సంపద అని).
* మామిళ్ళు కాస్తే మశూచికాలు మెండు.
* మామిళ్ళకు మంచు చెఱుపు, కొబ్బరికి కుడితి చెఱుపు.
* మామిళ్ళు నరికి మోదుగలు నాటినట్లు (పువ్వులకు మురిసి).
* మాయలవాడు మహితాత్ము సాటియా?
* మా యింటాయన కెంత మతిమరుపంటే నీళ్ళలోబడి ఈదను మరచిపోయినాడు.
* మా యింటాయన వ్రసింది మా యింటాయెనే చదువాలంటేం మా యింటాయన రాసింది మా యింటాయూనే చదువలెడన్నదట ఇంకొకతె.
* మాయింటిమగవారు మమ్ము దొబ్బుటేగాని పొరుగింటి పోరుల పొంత పోరు.
* మా ఇంట్లో తిని మీ ఇంట్లో చేయి కడుక్కో మన్నట్లు.
* మాయ సంసారం- మంటి దొంతులు.
* మారకం మొన్నటి మాదిరే, తిండి ఎప్పటి మాదిరే.
* మారికి వారశూలా?
* మారిన తనయింటికి రమ్మనినవానిని ఏమనాల?
* మారుచీర లేక మేలుచీర కట్టుకొన్నట్లు.
* మారుమనువు చేసుకొని, మొదటిమొగని సుద్దులు చెప్పినట్లు.
* మారు పెట్టించుకోక (పోసుకోకుండాపోతే) మరల రాదు (మారు=మజ్జిగ, మరల పెట్టించుకొనుట).
* మారు లేని తిండి మాల తిండి, దొరలేని తిండి దయ్యపు తిండి.
* మారులోకానికి వెళ్ళినా, మారు తల్లి వద్దు.
* మార్గశిరంలో మాట్లాడటానికి పొద్దుండదు.
* మార్గశిరాన మామిడి పూత.
* మార్జాలస్వప్నాలు మాంసం మీదనే.
* మాలకు మాంసం గొడారికి తోలు (గొడారి=మాదిగ).
* మాలకూటికి పోయినా నీళ్ళపప్పే.
* మాలకూటికి లోబడ్డా పప్పుబద్ద దొరకలేదు.
* మాలజంబం మల్ల (మూకుడు) మీద, వానజంబం ఊసరం మీద.
* మాలదాన్ని ఎంకటమ్మ! అంటే, మదురెక్కి నీళ్ళచాయ కూర్చున్నదట (నీళ్ళచాయ=చెంబట్లు, దొడ్డికిపోవుట, నీటివైపుపోవుట అనుట
* మాలదాన్ని ఎంకటమ్మ! అంటే, మరికాస్త ముందరింట్లోకి వచ్చిందట.
* మాలదాన్ని ఎంకటమ్మ! అంటే, మఱింత బిగుసుకొన్నదట.
* మాలపల్లెలో మంగళాష్టకాలు.
* మాలపున్నమ ముందర మాదిగవాడైనా చల్లడు.
* మాలబంటుకు ఇంకొక కూలిబంటా?
* మాలబింకె(కా)లు మందబయలున, వానబింకాలు బొల్లిచవుళ్ళలోను.
* మాలముద్దు వెన్నగాల్చి పెట్టబోయిందట.
* మాలలకు మంచాలు, బావలకు పీటలా?
* మాలవాడ కుక్క మఱి అన్న మెఱుగునా?
* మాలవాడ(ను) కుక్క మరగిన చందంబు.
* మాలవాడి పెళ్ళి మహసూల్ తో సరి (మహసూల్ = కుప్పనూర్పిళ్ళు).
* మాలవాడు చేసినట్లు ఉండాల, సంసారి చెడ్డట్లే ఉండాల.
* మాలాయగారికి తోలాయ గారు గురువు.
* మాలీషు చేసినట్లూ ఉణ్దవలె, కాపు చెడ్డట్లూ ఉందవలె.
* మాలోడికి నాకెందు కింతపెద్ద వాలగ అన్నాడట (వాలగ =ఒక రకమైన చేప).
* మావాడు దెబ్బల కోరుస్తాడు అంటే, విడిపించే దిక్కులేక అన్నట్లు.
* మావాళ్ళు వద్దన్నందుకు, మంగళగిరి తిరునాళ్లకు వెళ్ళినందుకు నాపని ఇంటే కావాలి- అన్నదట.
* మావళ్ళు వద్దన్నదానికి, నేను వచ్చినదానికి, ఇతణ్ణపుదానికి, యిట్లానే కావాల కొట్టుకో మన్నదట.
* మావి మాకిస్తే, మడిమాన్యా లిచ్చినట్లు.
* మాస(ష) మెత్తు బంగారు మనిషిని గాడిద చేస్తుంది.
* మాసికలేసిన గుడ్డ, దాసిదాని బిడ్డ.
* మాసికలేసిన బొంత - లిద్ది వేసిన బండికుండ.
* మాసికానికి ఎక్కువ, తద్దినానికి తక్కువ.
* మాసినతలకు మల్లెపూల అలంకారమా?
* మాసేమో పెద్దమాసి, బుద్ధేమో గాడిద బుద్ధి (మాసి=మనిషి).
**********:: మి ::**********
* మింగను మెతుకులేకుంటే, లంజకు లత్తుకట
* మింగను మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అట.
* మింగిన పిడసకు రుచి ఏమన్నట్లు.
* మించినదానికి మంచి లేదు.
* మింటికన్నా పొడుగు, నగరికన్నా ధాష్టీకం లేవు.
* మింటికి మంటికి ముడివేసినట్లు.
* మిండగాని జూచి గుందములో పడతాను అన్నదట.
* మిండగాడు డబ్బివ్వకపోతే, మొగుడితో పోయినట్లనుకుంటాను పొమ్మన్నదట.
* మిండడి ఈవి ఎంతో, లంజ మక్కువా అంతే.
* మిండని నమ్ముకొని జాతరకు పోయినట్లు.
* మిండల కొడుకుల సంపద దండుగలకే గాక (ఱండలకే గాక) దానధర్మము లగునా?
* మిండలను మరిగినమ్మా, మీగడతిన్నమ్మా ఊరకుండరు.
* మిగిలితే మిండడౌతాడు అన్నట్లు.
* మిగిలిన సున్నాన్ని, మిగిలిన రాజును ఊరకే వదలరాదు.
* మిట్టానువారి సైతాను మిడ్డెక్కి అదిలించినా పోదు.
* మిట్టిపడును నరుడు చేటెరుగక.
* మిడి(ణి)కి చచ్చేదాని ముందు కులికి చావాలి.
* మిడిమేలపు మిండని ఉంచుకునేకంటే గట్టుకు మంచం మోయవచ్చు.
* మిడుగురులు చీకట్ల నడచునా?
* మిడుతంభట్లు జోస్యం వలె.
* మిడుతంభట్లు తైతుల మిత్తి.
* మితం తప్పితే, అమృతమైనా విషమే.
* మితం తప్పితే, హితం తప్పుతుంది.
* మిథునంలో పుట్టిన మొక్క, మీసకట్టులో పుట్టిన కొడుకు అక్కరకు వస్తారు.
* మిద్దె ఉన్నవాడు బ్రతికి, గుడిసె ఉన్నవాడు చావడు.
* మిద్దె మీద పఱుగు, మీసాలమీద మెఱుగు.
* మినుములు తింటూ, అనుములు చేతిలో పెట్టినట్లు.
* మిన్ను కలిగినా, కన్ను కలిగినా కారక మానవు (కలుగు=ఎఱ్ఱనగు).
* మిన్నుపై బడినా మెలపుతో నఱచేతులొగ్గ జాలినవాడు.
* మిన్ను విఱిగి మీదపడితే అరచేతితో అడ్డగలమా?
* మిన్ను విఱిగి మీదపడ్డట్లు.
* మిరపకాయ చిన్నదని మేల మాడరాదు.
**********:: మీ ::**********
* మీఇంటి గేదె, మాఇంటి దూడ, తీసుకురా తిమ్మక్కా వీసెడు నెయ్యి.
* మీ ఇంట్లో తినివచ్చి మాఇంట్లో చేయి కడుక్కోమన్నట్లు.
* మీ ఊరు మా ఊరికెంత దూరమో, మా ఊరూ మీ ఊరికి అంతేదూరం.
* మీకు మాట, మాకు మూట.
* మీగడ మింగేవానికి వెన్న ఎట్లా వస్తుంది?
* మీగాలి మీద పడిన మెతుకు మిట్టి మిట్టి పడ్డట్లు.
* మీగాళ్ళు వాచినమ్మా! ంఈ ఇంట్లో ఓండ్లి ఎప్పుడూ? అంటే, మోకాళ్ళు వాచినమ్మా! మొన్ననే అయిపోయింది అన్నదట.
* మీ గొడ్డు కింత నున్న అంటే, మా బిడ్డ కింత వెన్న అన్నట్టు.
* మీద మిల మిల, లోన లొటలొట.
* మీద మెరుగులు, లోన పురుగులు.
* మీనమేషాలు లెక్క బెట్టినట్లు.
* మీను మ్రింగిన గ్రుక్కెడుతో మున్నీటికి కొరత ఏర్పడుతుందా?
* మీబిడ్ద కింత తవుడంటే, మీబిడ్డ కిన్ని పాలు అన్నట్లు.
* మీర లేని చుట్టం వస్తే, మిడకక తెల్లారదు.
* మీసం పస మగ మూతికి.
* మీసాల పసేగానీ, కోస నా బట్ట.
* మీసాలు వడదిరిగి ఉంటే, బుగ్గలు బటువుగా ఉంటవని నమ్మక మేమి?
* మీసాలెందుకు రాలేదురా? అంటే, మేనత్త (చాలు) చీలిక అని, గడ్డం వచ్చిందేమిరా? అంటే, అది మేనమామ పోలిక అన్నాడట.
**********:: ము ::**********
* ముంజ ముదిరినా, లంజ ముదిరినా కొరగావు.
* ముంజలు తిన్నవానికంటే, మోరులు తిన్నవానికే తంటా.
* ముంజేతి కంకణానికి అద్ద మెందుకు?
* ముంజేతిలో సత్తువ ఉంటే, మణికట్టులతో వడ్లు మొదుగుతాయి.
* ముంజేయి ఆడితే, మోచేయి ఆడుతుంది.
* ముంజేయి మళ్ళితేనే మోచేయి మళ్ళేది.
* ముండకు దొరికేది మొరటు (మోటు) మొగుడే.
* ముండాకొడుకే కొడుకు, రాజు కొడుకే కొడుకు.
* ముండ చావనూ చావదు, ముట్టు తప్పనూ తప్పదు
* ముండ పెంచిన కొడుకు - ముకుదారం (తాడు) లేని కోడె.
* ముండ ముప్పావుకు చెడ్డది, నరకుడు పావుకు చెడ్డాడు (నరకుడు=నరుడు).
* ముండ మొయ్యవచ్చును గానీ, నింద మొయ్యరాదు.
* ముండమోపి కాళ్ళకు మ్రొక్కితే, నీవూ నావలనే వర్థిల్లమని దీవించిందట.
* ముండమోపి కేల ముత్యాల పాపిట.
* ముండమోపి బలుపు - పాండురోగి తెలుపు.
* ముండాకొడుకు మూటికి జెడితే, ముండ నూటికి జెడుతుంది.
* ముండపై వలపుతో మోవి అనగానే జొల్లు, జుంటితేనె గాదు.
* ముండ్లమీద పడ్డ బట్ట మెల్లిగా తీసుకోవలె.
* ముండా కాదు ముత్తైదువా కాదు.
* ముంత మూతికట్టు, సంచి సభ కట్టు.
* ముంతెడు నీళ్ళకు ఉలిక్కి పడితే, బానెడు నీళ్ళు నీబావ పోసుకుంటాడా?
* ముంతెడు పాలకు ముత్యమంత చేమిరి (మజ్జిగ).
* ముందటివానికి ముంతం బలి, వెనకటివానికి తెడ్డెం బలి.
* ముందరికాళ్ళకు బంధాలు వేసి, ముండల తాళ్ళు తెంపినట్లు.
* ముందరికి వచ్చి కాలు విరుగపడ్డట్లు.
* ముందరేరు పోతే, ఆరేరే ముందరే రౌతుంది.
* ముందు అరకకు మొనగాళ్ళను కట్టవలె.
* ముందు ఆకు (విస్తర) వేయించుకుంటే, రరువాత ఎప్పుడైనా తినవచ్చు.
* ముందు(కుపోతే) గొయ్యి, వెనుక(కుపోతే) నుయ్యి.
* ముందుకుపోతే మురికిముండ, వెనుకకుపోతే వెఱ్ఱిముండ.
* ముందువచ్చే చండ్లను వెనుకకు నెట్టితే పోతవా?
* ముందు చచ్చింది ముత్తైదువ, వెనుక చచ్చింది విధవ.
* ముందు చూస్తే అయ్యవారి గుఱ్ఱంగా ఉంది. వెనుకచూస్తే సాహేబు గుఱ్ఱంగా ఉంది.
* ముందుచేసిన తప్పు మూలను ఉంటే, వెనుకచేసిన తప్పు మంచం కాడికి వచ్చినట్లు.
* ముందు నడిచే ముతరాచువాణ్ణి, వెనుకవచ్చే ఏనాదివాణ్ణి నమ్మరాదు.
* ముందు నడిచే ముతరాచువాణ్ణి, ప్రక్కన వచ్చే పట్రాతివాణ్ణి నమ్మరాదు.
* ముందు నడిపించి, కొంకులు కొట్తినట్లు.
* ముందున్నది ముసళ్ళ పండుగ.
* ముందున్నది ముసార్ల పండుగ
* ముందు పెళ్ళాం బిడ్డలు ముంత ఎత్తుక తిరుగుతూ ఉంటే, లంజకు బిడ్డలు లేరని రామేశ్వరం పోయినాడట.
* ముందు పోటు, వెనుక తన్ను (ఎద్దు చేసే పని).
* ముందుపోయేది ముండ్లకంప, వెనుకపోయేది వెన్నముక్క.
* ముందు ముచ్చట్లు, వెనుక తప్పట్లు (చప్పట్లు).
* ముందు మునగ, వెనుక వెలగ (ఇంటికి కూడదు).
* ముందు మురిసినమ్మ పండుగ గుర్తెరుగదు.
* ముందు ముల్లు త్రొక్కి, వెనుక భద్రం అన్నట్లు.
* ముందు వచ్చినందుకు మున్నూరు వరహాలు దండుగ, మళ్ళీ ఏలవస్తివే? మాయదారి తొత్తా?
* ముందు వచ్చిన చెవులకంటే, వెనుక వచ్చిన కొమ్ములు (వాడి) ఎక్కువ.
* ముందు వచ్చినదానికి మూగుళ్ళు, వెనుక వచ్చినదానికి వేగుళ్ళు.
* ముందువాగికి ముందోపులు, వెనుకవారికి దొప్పదోపులు.
* ముందు వాళ్ళకి మూకి(కు)ళ్ళు, వెనుక వాళ్ళకు నాకి(కు)ళ్ళు.
* ముందు సంతకి అరవు ఏడ్చింది.
* ముందే ముక్కిడి పైన పడిశం.
* ముక్కిడికి తోడు పడిశము.
* ముక్కిడి కిచ్చిన నత్తు, విత్తిన మొలువని వితు.
* ముక్కిడి తొత్తుకు ముత్యపు నత్తేల?
* ముక్కిడిదాని పాటకు ముండోడి మెచ్చుకోలు.
* ముక్కు ఉండేవరకు పడిశ ముంటుంది.
* ముక్కు ఏదిరా? అంటే, తలతిప్పి చూపించాడట.
* ముక్కు కోసినా, ముందటి మొగుడే మేలు.
* ముక్కుకోస్తే మూడ్నాళ్లకొస్తుంది, కొప్పకోయరా కుమ్మరిమగడా.
* ముక్కు చిన్నది, ముత్యం పెద్దది (ముక్కెర పెద్దది).
* ముక్కు చొచ్చి కంట్లో ప్రవేశించినట్లు.
* ముక్కు డుస్సిన పసరం లాగు.
* ముక్కు దాటితే ముఱికి, నాలుక దాటితే నరకం.
* ముక్కు నలిపి దీపం పెట్టమంటే, మొగుడి (మామ) ముక్కు నలిపిందట.
* ముక్కు పట్టని ముత్యం, చెవు పట్టని కమ్మ.
* ముక్కు పట్టిన వానిచేత చీదించినట్లు.
* ముక్కు పట్టుకుంటే ప్రాణం పోతుంది (దుర్బలుడనుట).
* ముక్కు మూరెడు, సిగ బారెడు.
* ముక్కు మూసుకుంటే, మూడు ఘడియలు.
* ముక్కు మొగం లేని బిడ్డ, మొదలు తుది లేని పాట.
* ముక్కులో ఏవేలు పెట్టినా సరిపోతుంది.
* ముక్కులో చీమిడొయ్! అంటే, నీచేతితోనే కాస్త తీసివేయ మన్నాడట.
* ముక్కులోని వెంట్రుక కొప్పులోనికి వచ్చి, మూగవాడు అమ్మా! అన్ననాటికి చూతాంలే.
* ముక్కెడి ముక్కుకు తక్కెడు బంగారమట.
* ముఖం అందం, ముడ్డికి చేటు.
* ముఖము చూస్తే కనబడదా మీగాళ్ళ వాపు?
* ముఖము తేట, ముడ్డి తీట.
* ముఖము బాగోలేదని అద్దం పగులగొట్టినట్లు.
* ముఖము మాడుపు దీపమింటికి కొరగాదు, ఱంకుబోతు పెండ్లాం మొగుడికి కొరగాదు, ఏడ్పుగొట్టు బిడ్డ చంకకు కొరగాదు.
* ముఖములో సుఖంలేదు, మోకాళ్ళలో బిగువులేదు.
* ముఖస్తుతి, చేసినవానిని చేయించుకొనినవానిని ఇద్దరిని చెరచును.
* ముఖానికి ముక్కాసర, దండకు కొలికాసర.
* ముఖాలు చూచి బొట్టు పెడతారు, పిఱ్ఱలు చూచి పీటవేస్తారు.
* ముగ్గిరి మధ్య ముంత దాగింది.
* ముగ్గుపిండి అట్లకు పనికి వచ్చునా?
* ముగ్గురికి తెలిస్తే మూడులోకాలకు పాకుతుంది.
* ముగ్గురిని కూల్చెరా ముండదైవం.
* ముగ్గురు ఆడవాళ్ళు కూడితే, పట్టపగలే చుక్కలు పొడుస్తాయి.
* ముగ్గురు బిడ్దలను కంటే, ముసలివానికైనా కొరగాదు.
* ముగ్గురు మూడు లోకాలయితే, ముసలిది మాయలోకం.
* ముగ్గురెక్కిన బండి పొలిమేర దాటదు.
* ముచ్చు ముండకేల ముంజేతి కడియాలు?
* ముట్టుకుంటే ముత్యం, పట్టుకుంటే బంగారం.
* ముట్టుకున్న మూడు దండుగలు.
* ముట్లుడిగిన తర్వాత సమర్త సారె పెట్టినట్లు.
* ముట్లుడిగిన దానికి (సతికి) మగబిడ్డ పుట్టినాడన్నట్లు.
* ముడిబియ్యం తింటే, ముప్పు గడుస్తుందా?
* ముడి మూరెడు సాగదు.
* ముడివాటు సవాలుకు బ్రహ్మవాటు జవాబు.
* ముడి వేసాక ముండైనా ముతకయినా తప్పదు.
* ముడుపులు వెంకటేశ్వరుడికి, కేకలు గోవిందుడికి.
* ముడ్డికాల్చి మూతికి వెన్న రాచినట్లు.
* ముడ్డికిందకు నీళ్ళు వస్తే లేవక మానదు.
* ముడ్డికి పేడ ఉన్నదెల్ల, బండి ఎద్దేనా?
* ముడ్డిగిల్లి జోల పాడినట్లు.
* ముడ్డి మీద తన్నితే మూతి (నోటి) పండ్లు రాలినట్లు.
* ముడ్డిలో కారం చల్లి, విసనకఱ్ఱతో విసరినట్లు.
* ముడ్డిలో జబ్బో, ముద్దలో జబ్బో తేలితేనే మందు.
* ముడ్డిలో పుండుకు మేనమామ వైద్యం
* ముతకో సతకో మూడుబట్టలు, కుంటో గుడ్డో ముగ్గురు పిల్లలు.
* ముత్తెమంటి ముతరాచకులం చేపలు దిని చెడిపోయినట్లు.
* ముత్తిని విడిచి సత్తిని తగిలించుకొన్నట్లు.
* ముత్యమంత పదునుంటే, మూలాకార్తెలో చల్లినా ఉలవచేను కాయును.
* ముత్యాలు పగడాలు, ముట్టుకున్న జగడాలు.
* ముత్యపుచిప్ప లన్నిటికి ఒక రేవు, నత్తగుల్ల లన్నిటికి ఇంకొక రేవు.
* ము(మొ)దలియారి జంభం ఆముదానుకి చేటు.
* ము(మొ)దలియారుకు ఏమున్నదంటే, ఒక గుఱ్ఱపుబండి, యిద్దరు ముండలు, ఇంత బుడ్డ అన్నాడట.
* ముదికొమ్మ, ముదిమాను చేవ.
* ముదికొమ్మ వంగదు, ముదికొమ్మ కనదు.
* ముదికొమ్మ వంగదు, ముదిగొడ్డు ఈనదు.
* ముదిత చను మెత్తదైనా అధికారం మెత్తనైనా రోతురు.
* ముదిముప్పున (ముసలి ముప్పందాన) అంగటి ముల్లు.
* ముది మదితప్పిన మూడు గుణాలు.
* ముదిముండ పాతివ్రత్యమునకు జొచ్చినట్లు (వృద్ధనారి పతివ్రత)
* ముదిమికి ముచ్చట్లు లావు.
* ముదియగా ముదియగా మోహము లావు.
* ముదిరి చచ్చినా, ఎండి ఇడిసినా వగపులేదు.
* ముదురున వెసిన పైరు, ముదిమిన పుట్టిన కొడుకు.
* ముద్ద తలతిరిగి నోటికి వచ్చినట్లు.
* ముద్ద ముద్దకీ బిస్మిల్లానా?
* ముద్దరాలు మగడు ముదుసలి(ని) మెచ్చునా?
* ముద్దవేసిన తట్టు, మూతినాకుడు మాటలు
* ముద్దు చేసిన కుక్క మూతి నాకును, చనువు చేసిన భార్య చంక కెక్కును.
* ముద్దున పేరు చెడె, మురిపాన నడక చెడె.
* ముద్దులయ్య పోయి, మొద్దులయ్య అయినాడు.
* ముద్దులాడితే ముక్కు నొక్కినట్లు.
* ముద్దు మురిపం మావంతు, ముడ్డి దొడ్డి మీవంతు.
* ముద్ర ముద్రగానే ఉండగా, ముగ్గురు బిడ్డల తల్లి అయినట్లు.
* ముద్రలందు లేదు మూలమందేగాని.
* మునగ చెట్టుకు మున్నూరు రోగాలు.
* మునిగింది ముర్దారు, తేలింది హలాలు (ముర్దారు=అపవిత్రము; హాలాలు=పవిత్రము).
* మునిగితే గుండు, తేలితే బెండు.
* మునిగేవానికి తెలుసు నీటి లోతు.
* మునిమాపటిమాటలు ముందుకు రావు.
* మునుపుచెడ్డ ముత్తెమ్మా, గరిగబుడ్డి సమంగా బెట్టు.
* మున్నీరుచే యీత నీదినట్లు.
* మున్నూట అరవైనాలుగు శిగములున్నా ఒకటే, ముఫైఆరు గుల్లికొప్పు లున్నా ఒకటే.
* మున్నూటరువది రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి.
* మున్నూటికులానికి ముప్పు లేదు, మొండికాలికి చెప్పు లేదు.
* మున్నూరు కాపత్తకు ముష్టికోడలు.
* మున్నూరు రూపాయలిచ్చి అయినా, ముసలిదానిని కొనాల.
* మున్నూరు వరహాలు పోయె, మూతి మీసాలు పోయె, నంబి సోమయాజులు అన్నమాట తప్పదాయె.
* మున్నూరు శిఖలైనా కూదవచ్చును గానీ, మూడు కొప్పులు కూడరాదు.
* ముప్పదిమూడుకోట్ల దేవతలు ముక్కు పట్టించగలరుగానీ, నారాయణా అనిపించగలరా?
* ముప్పదిమూడు దున్నపోతులు కడిగేవాడికి, మూడు సాలగ్రామాలు ఒక లెక్కా?
* ముప్పదియారు (ముప్ఫైయారు) జట్లు కూడుతాయిగానీ, మూడు కొప్పులు కూడవు.
* ముప్పొద్దు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదు.
* ముప్ఫై తట్టల పేడ మోసే పోలికి, మూడు పుంజాలదండ బరువా?
* మురగన్న సందేహం, నిస్సందేహం.
* మురికి భాండమునకు ముసరు ఈగల రీతి.
* మురికిముండ ముచ్చట పేలపిండి చేటు.
* మురికి మురికి ముత్తైదువకంటే, వెల్లడియైన విధవ మేలు.
* మురిపెం తిరిపెం చేటు, ముసలి మొగుడు దీపం చేటు.
* మురిపెం తిరిపెం చేటు, ముసలి మొగుడు ప్రాణం చేటు.
* మురిపెమునకు మూడు నల్లపూసలు, కొలికికి ఒక తిరగలిరాయి.
* ముంగ కాయకు ముండ్లెన్ని? అంటే, కాకరకాయకు గంట్లెన్ని? అన్నట్లు.
* ముల(లు)గ కాయకు తగిన ముండ్లు, కాకరకాయకు తగిన కరకులు.
* ములగ చెట్టుమీద కాకి గూటి వలె.
* ముల్లాలు తిండికిలేక మొత్తుకుంటుంటే, పీర్లకు పంచదారా?
* ముల్లును తీయను ముల్లే కావాల - దొంగను పట్టను దొంగే కావాల.
* ముల్లుగట్టి (కట్టె; కోల) ఎడుగండ్ల ఎద్దులను నిలిపివేసినట్లు.
* ముల్లుతీసి (పుచ్చి) కొఱ్ఱడచిన చందము.
* ముల్లుతీసి గూటం కొట్టుకొన్నట్లు.
* ముల్లును ముల్లుతోగాక రోకట దీయుదురా?
* ముల్లు ముంతనేగాని పోదు.
* ముల్లు వచ్చి అరటాకు మీదపడ్డా, అరటాకు వచ్చి ముల్లుమీద పడ్డా ఆకుకే మోసం (అపాయం).
* ముషిణిచెట్టు అయినా, పచ్చని చెట్టు కొట్టరాదు (ముషిణి=ముష్టి; విషవృక్షం).
* ముష్టికి నష్టి ఏమి?
* ముష్టికి పోయి, తుష్టి లేదని ఏడ్చినట్లు.
* ముష్టికి మూడు సంచులా?
* ముష్టి మూడువిధాల (అందాల) సేద్యం.
* ముష్టిలో ముష్టి, ధర్మముష్టి.
* ముసలమ్మా! బుఱ్ఱ వణికిస్తావేమి? అంటే, ఊరకుండి నేనేమి చేస్తా నన్నదిట.
* ముసలాడికి వగలాడి ఆలైనా, ఆత్రపు విటకానికి అతిభాషి లంజైనా వెతలే.
* ముసలాపె (ముసలి ఆపె)తో వసంతా లాడినట్లు.
* ముసలి ఆవు (పసరం) పేడ ముడ్డిలో ఉన్నా ఒకటే, దొడ్లో (చేటలో) ఉన్నా ఒకటే.
* ముసలి కాలానికి ముప్పతిప్పలు.
* ముసలికి ముఱ్ఱాట, బేపికి తొగురాట (ముఱ్ఱాట=మూల్గుట).
* ముసలి కుక్కలు ఊరకె మొరగవు.
* ముసలి ముండకేల ముసిముసి నగవులు?
* ముసలిదానికి పెట్టినది, ముండకు పెట్టినది ఒకటే.
* ముసలిదానికి ముండ ముద్దు.
* ముసలి ముప్పందాన కుసుమరోగం వచ్చినట్లు.
* ముసలి ముప్పున తొలిసమర్త.
* ముసలివాడయినా బసిరెడ్డే మేలు.
* ముసలివాని మాట, ముళ్ళులేని బాట.
* ముసుగు మూడువేలు, ముసుగులో బొమ్మ మూడు దుగ్గాళ్ళు (దుగ్గాని= రెండు దమ్మిడీలు (దువ్వలు)).
* ముసుగులో గుద్దులాట.
* ముహూర్తం మంచిదైతే, ఎట్లా ముండ మోసెరా? అన్నట్లు.
* ముళ్ళుండగానే పన్నీరుపువ్వు పనికి రాకుండా పోతుందా? (పువ్వుకు పరువు తగ్గిందా?)
**********:: మూ ::**********
* మూగవాని ముందర ముక్కు గోక్కున్నట్లు (గీరుకొన్నట్లు).
* మూటికి ముడివేస్తే ఏమీలేదు (పెండ్లి అయిన తర్వాత).
* మూడుకాసుల దానికి ముప్పావులా బాడుగ.
* మూడుకొప్పులు ఒకటైతే ముల్లోకాలు ఏకమవుతవి.
* మూడుజన్మల సంగతి చెప్పగలను, పూర్వజన్మలో ఇచ్చి పెట్టుకోలేదు, కనుక ఈ జన్మలో దేవుడు నాకీయలేదు, కనుక ముందు జన్మలో నాకేమీ ఉండదు.
* మూడుతరాల దరిద్రుడు ముష్టికి వచ్చినట్లు.
* మూడు దినాలుంటే మురికి చుట్టం.
* మూడు దుగ్గానులకు మూతిమీసం గొరిగించుకొన్నట్లు.
* మూడు దుగ్గానుల కోతి, ఆరు దుగ్గానుల బెల్లం తిన్నట్లు.
* మూడు నాకి, ఆరు అతికినట్లు.
* మూడునాళ్ళ ముచ్చటకు ఆరుజోళ్ళ చెప్పులా?
* మూడునాళ్ళ ముచ్చటకు మురిసేవు ముందుగతి కానవు.
* మూడునాళ్ళ భాగవతానికి మూతిమీసాలు గొరిగించుకొన్నట్లు.
* మూడునాళ్ళ ముత్తైదువతనానికి ఆరుజోళ్ళ లక్కాకులు.
* మూడు నెలలు సాముచేసి, మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లు.
* మూడు పావులాల గుడ్డ, ముప్ఫై రూపాయల కుట్టు.
* మూడుపుట్ల చెవిటిదానికి ఆరుపుట్ల చెవిటివాడు ఆలోచన చెప్పినట్లు
* మూడు బోనాలు సిద్ధమైనవి, దివ్వెకట్టె ముడికి వచ్చినది, దొరగారు సువారునకు రావచ్చును (సువారము= కోటలో కొలువు).
* మూడు మనువులు వెళ్ళినా, పొయ్యి ఊదమన్నారు.
* మూడు మాటలలో ఆరు తప్పులు.
* మూడు మారులు తప్పిన, ఏడు దూరాలు.
* మూడు మూరా ఒకచుట్టే, ముప్ఫైమూరా ఒకచుట్టే.
* మూడు మూసి ఆరు అతికినట్లు
* మూడువందలు పెట్టి గేదెను కొని, మూడణాలు పెట్టి తాడు కొనలేనట్లు.
* మూడో తరగతిలో ఎందుకు ప్రయాణం చేసావంటే, నాల్గో తరగతి లేదు కాబట్టి అన్నాడట
* మూడో పెండ్లివాడికి ముహూర్తం కావలెనా?
* మూతి పెట్టినవాడు మేత పెట్టడా?
* మూతి ముద్దుల కేడిస్తే, వీపు గుద్దుల కేడ్చిందట.
* మూతులు నాకేవాడికి మీసాలెత్తే వాడొకడా?
* మూరెడు ఇంట్లో బాఱెడు కఱ్ఱ, ఎట్లా కొడతావో కొట్టరా మొగుడా.
* మూరెడు పొంగటం ఎందుకు? బారెడు కుంగటం ఎందుకు?
* మూరె డేక్కే దెందుకు? బారెడు కుంగే(దిగే)దెందుకు?
* మూరెడు ముందుకు పోనేల? బారెడు వెనక్కు రానేల?
* మూర్ఖచిత్తుడు కోపమునకు పెద్ద.
* మూర్ఖు డెపుడు గోరు ముదితలతో పొందు.
* మూర్ఖునకును బుద్ధి ముందుగానే పుట్టు.
* మూర్తి కొంచమైనా, కీర్తి దొడ్డది (పెద్దది
* మూల ఉండే వాళ్ళను ముంగిట్లోకి లాగినట్లు.
* మూలాకార్తెకు వరి మూల చేరుతుంది.
* మూలాకార్తెలో కురిస్తే, ముంగారు పాడు.
* మూల ముంచును, జ్యేష్ట చెరచును (కురిసి).
* మూలలో చల్లిన ఉలవలు మూడు పువ్వులు ఆరు కాయలు.
* మూలవాన ముంచక తీరదు.
* మూలవిగ్రహాలు ముష్టి ఎత్తుకుంటూ ఉంటే, ఉత్సవ విగ్రహాలకు దధ్యోదనమట.
* మూలవిరాట్టు తిరిపమెత్తుకుంతుంటే, (మొత్తుకుంటుంటే) ఉత్సవ విగ్రహాలకు తెప్పతిరునాళ్ళట.
* మూలిగిన మూతికేసి రాస్తారు.
* మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు.
* మూలుగులు మునుపటిలాగే, భోజనాలు మాత్రం ఎప్పటిలాగే.
* మూసిచూడను కాసులేదు, ముండను చూస్తే ముద్దొస్తుంది.
* మూసిన ముత్యం, మాయని పగడం.
* మూసిన ముత్యము, పాసిన పగడము.
* మూసిన వాయనం ముత్తైదువవలె.
* మూసిపెట్టితే పాచిపోయిందట.
**********:: మృ ::**********
* మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును.
* మృగశిర కురిస్తే ముసలిఎద్దు ఱంకె వేయును.
* మృగశిరతో గూడా ముల్లోకాలు చల్లబడును.
* మృగశిర బిందిస్తే ఇరుకార్తెలు ఎలుగిస్తవి.
* మృగశిరలో బెట్టిన పైరు, మీసకట్టున బుట్టిన కొడుకు మేలు.
* మృగశిర వర్షిస్తే, మఖ(ఘ) గర్జిస్తుంది.
* మృగశిర కురిస్తే, ముంగాలి(రు) పండును.
* మృతి దగ్గరకు వచ్చినా, సతి దగ్గరకు వచ్చినా మతి ఉండదు.
* మృత్యువు పంచాంగం చూచి పనిచేయదు.
* మృదు శబ్దానికి మధుశబ్దానికి భేదమేమిరా? అంటే, వట్లల్లో సుడి (వట్రుసుడి) అన్నాడట.
**********:: మె ::**********
* మెచ్చి మేకతోలు, కోరి గొఱ్ఱెతోలు కప్పుతారు.
* మెట్ట దున్నినవాడు, లొట్టె త్రాగినవాడు ఒకటే.
* మెట్ట నున్నా ఏనుగే, పల్లాన ఉన్నా ఏనుగే.
* మెట్టను మాత, పల్లాన భార్య.
* మెట్టరైతు లొట్టెపిట్ట.
* మెట్టినిండ్లనుండి కాన్పుకు పుట్టినిండ్లు చేరినట్లు.
* పెట్ల చప్పుడే గానీ, దోవ జరుగదు.
* మెడ తడవటం పూసల కొఱకే.
* మెడనూతు(కు)ల వారింట్లో పిడిగుద్దుల సమారాధన.
* మెడపూసలకు సమ్మసరిపోయిన బొమ్మలాట ఆడినట్లు
* మెడబట్టి నెట్టితే చూరుబట్టుకొని వ్రేళ్ళాడినట్లు.
* మెడలో రుద్రాక్షలు, మదిలో మదిరాక్షులు.
* మెతుకుపోతే బ్రతుకుపోతుంది.
* మెతుకులు చల్లితే కాకులకు కొదువా?
* మెత్తగా ఉంటే మొత్త బుద్ధివేస్తుంది.
* మెత్తటి పులి, సాదు పలవ.
* మెత్తటి పులి ధర్మ సూతి.
* మెత్తనాళ్లు పోయినవి, చెత్తనాళ్ళు వచ్చినవి.
* మెత్తని చోటనే గుద్దలి వాడి.
* మెత్తని మట్టిని మోచేతితో త్రవ్వినట్లు.
* మెత్తనిమాట లాడరా అంటే, దూది వెన్నపూస అన్నాడట.
* మెత్తనివాడిని చూస్తే మొత్త బుద్ధివేసినట్లు.
* మెత్తలు ఎందకువేస్తే, మెడల నొప్పులు పోతాయా?
* మెఱుగు వేయనిదే మృదువు రాదు (మెఱుగు=చమురు, నెయ్యి).
* మెఱుగు వేయనిదే మెఱుగు రాదు.
* మెఱుపుకొద్దీ వర్షము.
* మెఱుపు దీపంగాదు, మబ్బు గొడుగు కాదు.
**********:: మే ::**********
* మేక ఆకులు మేయగానే ఉపవాస మగునా?
* మేకకు ఙ్ఞాపకముండేది మేత ప్రసంగమే (సంగతే).
* మేకకు తెలిసిందంతా మేత సంగతే
* మేకకు మెడచన్నులు, తాళ్ళకు (తాడిచెట్లకు) తలచన్నులు.
* మేకపిల్లను చంకలో బెట్టుకొని ఊరంతా వెదకినట్లు.
* మేక పెంటిక ఎక్కడున్నా ఇక్కటే.
* మేక(పో)బోతు గాంభీర్యం - మాచకొమ్మ సౌందర్యం.
* మేక మెడచన్ను కుడిస్తే ఆకలితిరునా?
* మేక మెడచన్నులకు పాలు, మేడికి పూలు లేవు.
* మేక మెడచన్నులు పిసుకను పిండను పనికిరావు.
* మేక మెడచన్నులు (నిష్ప్రయోజనములు అనుట - అజాగళస్తనాలు).
* మేక మేయని ఆకు ఏదంటే - బండి ఆకు, రాట్నపు ఆకు.
* మేకలు తప్పించుకొంటే తుమ్మలు, మాలలు తప్పించుకొంటే ఈదులు (ఈదులు= ఈతచెట్ల తోపులు).
* మేకలే మడకలు దున్నితే, ఎద్దులు ఎవరికి కావాల?
* మేకవన్నె పులి.
* మేకశిరం మెత్తగా ఉన్నదని మఱికాస్త లాగాడట.
* మేఘాలు నలుపైతే వాననీళ్ళు నలుపగునా?
* మేడలు గుడిసెలు కావడం కన్నా, గుడిసెలు మేడలు కావడం మేలు.
* మేడిపండు జూడ మేలిమైయుండును పొట్టవిచ్చి చూడ పురుగులుండు.
* మేడసిరి కీడు చేయదు (మేడసిరి = అత్తిబాగా కాలి పేలుట).
* మేతకన్నా మసలితేనే బలం.
* మేతకరణమే గానీ కూతకరణం గాదు.
* మేతకేగాని చేతకు (కూతకు) కొరగాడు.
* మేదరసాల దుర్గంమీద మేకకాలంత మొయిలువేస్తే, తుల్లూరు దొందపాడు కాయ దూడకట్టు అయినా కాదు.
* మేనత్తపోలిక, మేనమామ చీ(చా)లిక.
* మేనత్త మూతికి మీసాలు ఉంటే చిన్నాయన అవుతాడు
* మేనమామకైతే ఇవ్వడు, పోలుబొందలలో పెడతాడు.
* మేపే రూపు.
* మేమే అంటే మెడలెక్కి కూర్చున్నాడట.
* మేయబోతే ఎద్దుల్లోకి, దున్నబోతే దూడల్లోకి.
* మేయబోయి మెడకు తగిలించుకొన్నట్లు.
* మేలుమేలంటే, మెడ విరగబడ్డట్లు.
* మేలోర్చలేని అబ్బకుతోడు మూగతల్లి దొరికినట్లు.
* మేసేగాడిదను కూసేగాడిద (వచ్చి) చెఱచిందట.
* మేసేజన్మలు మేతలు మానినవి, పలుకులు మానండఱ్ఱా పంజరాల చిలుకల్లారా అన్నట్లు.
* మేస్త్రీలు మేడకట్టితే, కుక్కకాలు తగిలి కూలిపోయిందట.
* మేహజాడ్యం, తోట సేద్యం.
**********:: మై ::**********
* మైనపుగోడలను గురించి కంచుగోడలు కాలిపోయినవట
* మైనపు ముక్కువాడు (ఏవైపంటే ఆవైపుకు తిరుగుతాడు).
**********:: మొ ::**********
* మొండి ఈతకు (యీనితే) మోపుడు జూక లన్నట్లు.
* మొండికి తగ్గ మిండడు.
* మొండికి సిగ్గులేదు, మొరడకు (మొరటుకు) గాలిలేదు.
* మొండికీ, బండకు నూరేండ్లాయుస్సు.
* మొండి కెక్కినదాన్ని మొగుడేమి చేయు? రచ్చ కెక్కినదాన్ని రాజేమి చేయు?
* మొండికెత్తితే మొగుడేమి చేస్తాడు? బండ కెత్తితే బావేమి చేస్తాడు?
* మొండి గురువు, బండ శిష్యుడు.
* మొండిచెట్టు గాలికి మిండడు, మొలకులేనివాడు దొంగలకు మిండడు.
* మొండిచేతితో మొత్తుకున్నట్లు.
* మొండిచేతితో మూరవేసినట్లు.
* మొండిచేతి వానికి నువ్వులు తిననేర్పినట్లు.
* మొండిచేతుల పెండ్లానికి మోదకాళ్ళ మొగుడు.
* మొండితోక గొడ్డు రాగోరును, గుడ్డిగొడ్డు పోగోరును.
* మొండిదానా! నీ మొగుడేమి చేసినాడంటే, అటుకొట్టి ఇటుకొట్టి వాడే పోయాడు అన్నదిట.
* మొండిమొగుడి పెండ్లికెళ్ళి, అర్థరాత్రివేళ అడ్డగోడ చాటునుండి అర్థరూపాయి కట్నం చదివించిందట.
* మొండిముక్కున ముక్కెర ఉంటే, మూతి తిప్పడమే ముచ్చట అనుకొన్నదట.
* మొండివాడు రాజుకంటే బలవంతుడు.
* మొండివాని హితుడు బండవాడు.
* మొక్క అయి వంగనిది మ్రానై వంగునా?
* మొక్కజొన్న కండె (కంకి) ముక్కలై మీదపడ్డట్లు.
* మొక్కబోయిన దేవర ఎదురు వచ్చినట్లు.
* మొక్కుబడే లేదంటే, ఒక్క దాసరికైనా పెట్టమన్నట్లు.
* మొక్కేవారికి వెఱవనా? మొట్టేవారికి వెఱవనా?
* మొగంవాచిన మొగుడికి పాచిన కూడు పెట్టితే, పాయసమని బుఱ్ఱు బుఱ్ఱున జుఱ్ఱుకున్నాడట.
* మొగ (మగ) పిల్ల బంగారు పుల్ల.
* మొగపిల్లలున్న యిల్లు, మోదుగలున్న అడవి అందము.
* మొగబుద్ధి మోటుబుద్ధి, ఆడుబుద్ధి అపరబుద్ధి.
* మొగమాటమునకు, మోక్షమునకు దూరము.
* మొగమాటానికి పోతే, ముండకు కడుపైనట్లు.
* మొగము మాడ్పుది మొగుడికి చేటు, ఈడ్పుకాళ్ళది ఇంటికి చేటు.
* మొగవాని మూతిపై ఉంటే, నాకు ముంజేతిపై ఉన్నవి వెంట్రుకలు అన్నదట ఒక మగరాయడు.
* మొగవారి కాలుసేయి తాకితే, ఆడువారు పెకల్లుతారట.
* మొగిళ్ళు చూచి మోట చాలించినట్లు.
* మొగడంటే మొద్దులుబెట్టి, మిండ డంటే ముద్దులు పెట్టును.
* మొగుడికి మోదుగాకు, అల్లుడికి అరటాకు.
* మొగుడికే (మగడికే) మొగతనంఉంటే, అగసాలాయనతో అవసరమేమి? (అకోరించటంఎందుకు?)
* మొగుడికే మగతనం ఉంటే, తంబళ్ళవారి తగులాట మేమి?
* మొగుడిని కొట్టి మొగసాల కెక్కినట్లు.
* మొగుడినిచూస్తే పైసా లేదు, ముండను చూస్తే ముచ్చటౌతుంది.
* మొగుడిమీది కోపం పొద్దు మునిగేవరకే.
* మొగుడు అంటే ఘోష, డబ్బు అంటే ఆశ.
* మొగుడు ఈయని గౌరము, తల్లిచేయని గారాబము.
* మొగుడు ఒగ్గినా మామ ఒగ్గడు.
* మొగుడు కొట్టినందుకు కాదుగానీ, తోడికోడలు నవ్వినందుకు.
* మొగుడు కొట్టిన కొట్లు ఊరెల్ల రట్లు, మిండడు కొట్టిన కొట్లు ముత్యాలకట్లు.
* మొగుడు కొట్టితే కొట్టినాడు గానీ, ముక్కుచీమిడి బాగా వదిలింది.
* మొగుడు కొట్టినాడని మొల్లవాని దగ్గఱకుపోతే, మొల్లవాడు తెల్లవార్లు కొట్టినాడట.
* మొగుడు కొద్దీ వన్నెలు, సిరికొద్దీ చిన్నెలు.
* మొగుడు చచ్చిన వెనుక ముండకు బుద్ధి వచ్చిందట.
* మొగుడు చచ్చి మొత్తుకుంటుంటే, మిండమగడు వచ్చి రాళ్ళు రువ్వాడట (వేశాడట).
* మొగుడుని చూచిన దండగ, మిండని చూచిన పండగ.
* మొగుడు పెండ్లాం పోట్లాడి, యాయావారం బ్రాహ్మణ్ణి చావకొట్టినట్లు.
* మొగుడు లేకపోతే అప్పమొగుడు, కూర లేకపోతే పప్పుకూర.
* మొగుడు లేనిదానికి గూడా మంత్రసాని తప్పదు.
* మొగుడే ముండా అంటె ముష్టికి వచ్చినవాడు గూడా ముండా అంటాడు.
* మొగుడొల్లక ముప్ఫై యేడ్లు, ఆలొల్లక అరవై ఏండ్లు, బాలప్రాయం పదేండ్లు.
* మొగునితో పెళ్ళికి, పిల్లలతో తీర్థానికి వెళ్ళరాదు.
* మొగుని పెత్తనం, మొండి మేనత్త.
* మొగునిమీద కోపంచేత మాదిగవాని వెంట పోయినట్లు.
* మొగుళ్ళ పొద్దు మోసపుచ్చె, కోడలిప్రాణం కొలుకులోకి వచ్చె.
* మొట్టేవాడికి వరమిస్తాడు గానీ, మొక్కేవారికి వరమీయడు.
* మొత్తుకోళ్ళోయి ముత్తయ్య సెట్టి.
* మొదట మానెడు, దూడ చస్తే దుత్తెడు.
**********:: టా ::**********
* మొదటికే మోసమైతే, లాభానికి గుద్దులాట.
* మొదటికే మోసమైతే, వడ్డి ముట్టలేదన్నాడట.
* మొదటి చూపుకే కలిగిన వలపుకు కాలయాపన లేదు.
* మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కల్యాణమట.
* మొదటి పెండ్లి అవసరము, రెండోపెండ్లి అవివేకము, మూడోపెండ్లి అపస్మారకము.
* మొదటిముద్దుకే మూతిపండ్లు రాలినట్లు.
* మొదలుంటే పిలకలు పెడుతుంది.
* మొదలు మునిగితే వడ్డి మునుగదా?
* మొదలు చేవలేక తుద నెట్లు కలుగురా?
* మొదలు మోదుగ పూస్తే, కొన సంపెంగ పూస్తుందా?
* మొదలు లేదు శ్రీరామా! అంటే, మొలతాడు లేని పాతగోచి అన్నాడట.
* మొదలు లేదు సుబ్బక్కా! అంటే, ఒక్కదేవరకైనా మొక్కాక్కా అన్నదట.
* మొదలు లేదు సుబ్బక్కా! అంటే, ముంతేది పెద్దక్కా అన్నదట.
* మొదళ్ళు మీకు, మోసులు మాకు.
* మొదలు విడిచి కొనలకు నీళ్ళు బోసినట్లు.
* మొదలే కుంటికాలు, దానికితోడు పక్షవాతం.
* మొదలే కోతి, పైగా కల్లు తాగినట్లు.
* మొదలే మన్ను, కఱవు వస్తే గడ్డలు.
* మొద్దు (మోటు) ముందకు దొరికేదంతా మోటు శిశినాలు.
* మొద్దు మొగానికి తోడు, గరుడసేవా?
* మొప్పెకు మూరెడు నోరు.
* మొప్పెకు మొగిలిపువ్విస్తే, మడిచి (ముడ్డి) గుద్దలో పెట్టుకున్నదట.
* మొయిలువిడిచిన యెండ, మొగుడువిడిచిన ముండ, పట్టివిడిచిన మండ, ఎత్తివిడిచిన కుండ.
* మొఱకకు సివమెత్తిన మ్రొక్కక తప్పదు.
* మొఱిగే కుక్క కఱవదు (అరిచే కుక్క).
* మొఱ్ఱలో మొఱ్ఱ మొండిచెయ్యి చూపించేయి.
* మొఱ్ఱో! మొఱ్ఱో! వద్దనగా, లింగం కట్టేరుగానీ మొక్కచేతులు తేగలరా?
* మొలది విప్పి తలకు చుట్టినట్లు.
* మొలబంటి దుఃఖంలో, మోకాలిబంటి సంతోషం.
* మొలిచేచెట్టు మొలకలోనే తెలుస్తుంది.
* మొసలిబావా! కడిమిచెట్టు వేరాయెగానీ, కాలైనా ఇంతేకదా.
**********:: మో ::**********
* మోకాటిలో మెడనరం పట్టిందంటే, మీద పట్టి వేయమన్నట్లు.
* మోకాలు ముణిగింది అని ముక్కు మూసుకుంటారా?
* మోకాలెత్తు విగ్రహముంటే, మొలలోతు కూడు.
* మోకాలెత్తు ముందుకు, మోచేతులు వెనక్కు.
* మోచినమోపును ఇందరు మోయవలెనా?
* మోచేతిదెబ్బ చూడక, ఱాచిప్పకు అతుకు పెట్టబోయినట్లు.
* మోచేతి దెబ్బ - మొగుడింటి కాపురం.
* మోచేయిపోయి మొకరానికి తగిలినట్లు (మొకరము=స్థంభము).
* మోటుకు కోపం ముక్కు మీద.
* మోతకు పొమ్మంటే, ఆటకు పెట్టినాడు.
* మోటువాడికి మొదటిచోట కంపు, వన్నెగాడికి మూడుచోట్ల కంపు.
* మోటువాడి కేమితెలుసు మొగలిపువ్వు వాసన.
* మోట్లుకొట్టగా మగనితో గూడలేస్తే, గుడ్డబట్టలు దులుపేవఱకే కూటివేళాయె.
* మోతచేటేగానె మోక్షంబు లేదయా.
* మోతనీటిలో యీత యీదినట్లు.
* మోదుగపువ్వు అందము - పసిమిరోగము మిసిమి.
* మోపూరువాళ్ళ మొగుళ్ళు చస్తే, తలమంచివాళ్ళు తాళ్ళు తెంచుకొన్నట్లు.
* మోసేవానికి తెలుసు (కావడి) బరువు.
* మోక్షానికిపోతే మొసలి యీడ్చుక (ఎత్తుకొని) పోయిందట.
* మోహభ్రమని జిక్కి మొనగాడు నీల్గడా?
**********:: మౌ ::**********
* మౌనంబు దాల్చుట మనసిచ్చగింపమి.
* మౌనం మర్ధంగీకారం
* మౌల్వీలు మదురు మేస్తుంటే, పీర్లకు పిండివంటలా?
**********:: మ్రా ::**********
* మ్రానిపండ్లు మ్రానుక్రిందనే రాలును.
**********:: మ్రు ::**********
* మ్రుగ్గు వేయనివారిని యముడు, జాంబవంతుని వెంత్రుకలు పెరక బెడతాడట.
**********:: మ్రొ ::**********
* మ్రొక్కబోయిన గుడి ముక్కలై మీదపడ్డట్లు.
* మ్రొక్కబోయిన దేవు డెదురైనట్లు.
* మ్రొక్కిన మ్రొక్కు చక్కనై, మగనికండ్లు రెండూపోతే, ఆరుగాళ్ళ జీవాన్ని దేవునకు అర్పితం జేతు నన్నదిట (ఆరుగాళ్ళ జీవం=ఈగ).
