తామసించి చేయదగదెట్టి కార్యంబు
తామసించి చేయఁదగఁదెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమ మగును
పచ్చికాయఁ దెచ్చి పడవేయ ఫలమౌనె
విశ్వధాభిరామ వినురమేమ
తాత్పర్యం-
కోపముతో యెట్టి పనియు చేయరాదు. తొందరించినయెడ నది విరోధమగును. పచ్చి కాయను తెచ్చి ఓ మూల వేసినచో అది పండు కాగలదా ? అందుకే ఆవేశంతో ఏ పని చేయరాదు.
