తమాషా ప్రశ్నలు -7
1. చర్మానికి సోకే పూలరోగం
తామర
2. అమ్మపెట్టలేని చారు
అరిచారు
3. పోరాటం లో కోపంగా వెల్లమనేది
పోరా
4. ధనం ఇచ్చి కొనుక్కొనే ధనం
ఇంధనం
5. సినిమా హీరో చెయ్యలేని పాత్ర
వంటపాత్ర
6. దేవుడులేని ఆలయం
కార్యాలయం
7. పదిలం లో ఉన్న జంతువు
పంది
8. సర్పంచి లో బజారుకివెల్తే అవసరమైంది
సంచి
9. బచ్చలి కూరలో అమ్మవారికి బలి ఇచ్చెది
బలి
10. ఉండవల్లిలో చలవ చేసేది
ఉల్లి
11. పరసులో దాచుకోలేని ధనం
ఇంధనం
12. ఎరువుగావాడే పోస్ట్
కంపోస్ట్
13. ఇంటికిచుట్టూ ఉండే కారం
ప్రాకారం
14. మనిషి ముట్టుకోలేని విల్లు
హరివిల్లు
15. రోడ్డు మీద లేని బ్రిడ్జి
కేంబ్రిడ్జి
16. మనిషికి లేని గోల్లు
కొనుగోల్లు
17. బరువులని తూచే బ్రిడ్జి
వేబ్రిడ్జి
18. నీరులేని సాగరం
దుఃఖసాగరం
19. రోడ్డు మీద తిరగని కార్లు
స్వర్ణ కారులు
20. తినే బలి
అంబలి
