తమాషా ప్రశ్నలు -5

bookmark

1. అరవకుండా భయపెట్టే కాకులు?
చికాకులు

2. చూడలేని నయనం?
ఉపనయనం

3. చేపలు పట్టడానికి పనికిరాని వలలు?
కవలలు

4. ఎగిరే నరం?
వానరం

5. పేలే రంగులు?
ఫిరంగులు

6. ఎవరూ చూడలేని రూపం ?
అపురూపం
7. చూసి చెప్పే రుచి ?
అభిరుచి

8. ఆవు ఇవ్వని పాలు ?
జులపాలు

9. కూరలో వెయ్యలేని కారం
మమకారం

10. జాలారి పట్టలేని ఫిష్ ?
సెల్ ఫిష్

11. తిరగని గ్రహాలు
విగ్రహాలు

12. నామాలు లేని వ్రతం
మౌనవ్రతం

13. నాలుకతో చెప్పలేని రుచి
అభిరుచి

14. వేలాడే పాలు
జులపాలు

15. తినలేని వడ
దవడ

16. ఎప్పుడూ వెలెగే జ్యోతి
ఆశా జ్యోతి

17. తొండలో శరీర భాగం
తొడ

18. లోక్ పాల్ లో ప్రక్కనున్న దేశం
పాక్

19. దారుణంలో పసువులు తినేది
దాణ

20. బీరుదొరకని బారు
సాంబారు