తమాషా ప్రశ్నలు -17

bookmark

1. కారం కాని కారం?
మమకారం

2. తెలంగాణా లో ఓనీకి జత?
లంగా

3. పాము తినని కప్ప?
తాళంకప్ప

4. పేరు లో బీరున్న భక్తుడు?
కబీరు

5. ఎగిరే రాయి?
పావురాయి

6. చక్రాలు లేని కారు?
పట్టుకారు

7. చెట్టు కు కాయని కాయ ?
గుండెకాయ

8. అందరి ఇంట్లో ఉండే కాయ?
ఆవకాయ

9. తినే వడ?
పావడ

10. రిలేషన్ లో దాగిఉన్న సోప్ ఏది ?
రిన్

11. టైలర్ కుట్టని లాగు?
కేటలాగు

12. పూజలందు కోని సాయి?
కసాయి

13. టీ పొయ్యిలేని కప్పు?
పై కప్పు

14. ముద్దాడ లేని పాప?
కనుపాప

15. నింప లేని ఫారం?
ప్లాట్ ఫారం

16. ప్రపంచ పటం లో లేని దేశం ?
సందేశం

17. తినే రేకు లు ?
పూత రేకులు

18. రైతు పండించని వరి ?
ఫిబ్ర వరి

19. విద్యా ర్ధు లు రాని బడి?
రాబడి

20. బడికి రాని మాస్టర్ ?
పోస్టు మాస్టరు