జయ జయ జయ ప్రియ భారత

bookmark

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ సుశ్యామల సస్య చలచ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా! || జయ ||

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా! || జయ||