ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన

bookmark

ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపేకాని తెలుపుగాదు
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టిన బలుకునా
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
ఎలుకతోలు తెచ్చి దానిని అదేపనిగా సంవత్సరాల పాటు ఉతికినను అది తెల్లబడదు. అలాగే ఒక ప్రాణం లేని కొయ్య బొమ్మ ను తెచ్చి ఎంత సేపు కొట్టినను అది మాట్లాడదు.