ఆనందాల కల్పవల్లి
అదే నీ తెలుగు తల్లి
అందాల నిండు జాబిల్లి
ఆనందాల కల్పవల్లి
అదే నీ తెలుగు తల్లి
పదవోయ్ తెలుగువాడా
అదే నీ తెలుగు మేడ
సంకెళ్ళు లేని నేల
సంతోష చంద్రశాల
కనవోయ్ తెనుంగు రేడా
అదే నీ అనుంగు నేల
అదిగో సుదూరనేల
చనవోయ్ తెలుగు వీరా
స్వర్ణాల కాంతి స్వప్నాలు
స్వప్నాల శాంతి స్వర్గాలు
నిన్నే పిలుస్తున్నాయి
నిన్నే వరిస్తున్నాయి
ఆందోళనాల డోల
సందేహాల హిందోళ
ఎందాక ఊగిసలాట
ఇదే నీ గులాబీ తోట
