ఆత్మశుద్ధి లేని యాచారము యేల

bookmark

ఆత్మశుద్ధి లేని యాచారము యేల
భాండ శుద్ధి లేని పాకమేల ?
చిత్తశుద్ధి లేని శివపూజలేల రా ?
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
నిర్మలమైన మనస్సులేని వట్టి ఆచారమెందుకు ? కుండ పరిశుభ్రముగా వుండని వంట యెందుకు ? స్థిరచిత్తము లేని శివపూజలెందుకు, ఇవన్నీ చేసినా వ్యర్థమే కదా ?